ఇసుక.. బంగారం కంటే విలువైందిగా మారిపోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి పారుతున్నా ఇసుకకు ఇబ్బందులు తప్పడంలేదు. కొందరు ఇసుకను అక్రమంగా దాచేసి ఆంధ్ర సరిహద్దుల నుండి తెలంగాణాకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. భారీ స్థాయిలో ఇసుకను అక్రమ నిల్వలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యక్తులు, రాత్రివేళల్లో ట్రక్కుల కొద్దీ ఇసుక తరాలిపోవడాన్ని చూస్తే సరిహద్దుల్లో అధికారుల పనితీరు విస్మయానికి గురిచేస్తోంది, యటపాక మండలంలో కొందరు వ్యక్తులు రాత్రి వేళల్లో ఇసుకను తెలంగాణకు తరిస్తున్నారు, ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా యటపాక మండలం సీతంపేట వద్ద సుమారు 50 ట్రక్కుల ఇసుకను స్మగ్లర్లు అక్రమంగా నిల్వ ఉంచారు..అయితే ఈ ఇసుకను ప్రయివేటు వ్యక్తుల స్థలంలో నిల్వ ఉంచిన సంగతి కనీసం ల్యాండ్ ఓనర్లకు కూడా తెలియకపోవడం ఆశ్చర్యం. అయితే ఇసుక స్మగ్లర్లు రెండో కంటికి తెలియకుండా రాత్రికి రాత్రే అక్రమంగా ఏర్పాటు చేసిన క్వారీల నుంచి తవ్వి తీసుకొస్తున్నట్లు సమాచారం.
స్మగ్లర్లు ఈ అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగిస్తున్నప్పటికి అధికారులు పట్టించుకోకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా తమ స్థలంలో తనకే తెలియకుండా ఇసుకని తెచ్చి నిల్వ ఉంచారంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్ళు తెరచి ఇసుక దందా నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుని, తమ స్థలంలో నిల్వ ఉన్న ఇసుకను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు అమ్మి అక్రమంగా సంపాదిస్తున్నవారి భరతం పట్టాలంటున్నారు.
Cyclone Effect: రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అకాల వర్షాలు