Site icon NTV Telugu

AP-Telangana: రాష్ట్రాలు వేరైనా రాజకీయం ఒక్కటే.. పార్టీలు వేరైనా పరిస్థితి ఒక్కటే..

Ap And Ts

Ap And Ts

రాష్ట్రపతి ఎన్నిక విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన రాజకీయం నడుస్తోంది. అటు ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఒకే అభ్యర్థికి, ఇటు తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ సేమ్‌ క్యాండేట్‌కి సపోర్ట్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీ, అపోజిషన్‌లో ఉన్న పార్టీ ఒకే అభ్యర్థికి మద్ధతు తెలపవు. కానీ ఇది అరుదైన సందర్భం. ఆసక్తికరం కూడా. ఏకగ్రీవంగా ఎన్నుకునేటప్పుడు అధికార, ప్రతిపక్షాలు ఒకే క్యాండేట్‌ని ఓకే చేయటం సహజం. కానీ ఇప్పుడు కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం పోటీ నెలకొంది.

ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ, దాని మిత్రపక్షాల అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా బరిలో ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ద్రౌపది ముర్ముకే ఓటేయాల్సి వస్తోంది. ఈ మేరకు అధికార పార్టీ వైఎస్సార్సీపీ ఇప్పటికే ఆమెకు ఓటేస్తామంటూ ప్రకటన కూడా చేసింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా అఫిషియల్‌గా అనౌన్స్‌ చేయలేదు. టీడీపీ కూడా సైలెంటుగా, ఇన్‌డైరెక్టుగా “ద్రౌపదికే ముర్ముకే మా ఓటు” అన్నట్లే లెక్క.

ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు మమతా బెనర్జీ ఏర్పాటుచేసిన సమావేశానికి ఏపీలోని తెలుగుదేశం పార్టీకి కనీసం ఆహ్వానం కూడా అందలేదు. కాబట్టి టీడీపీ యశ్వంత్‌సిన్హాకి కలలో కూడా ఓటేయదు. అంటే ఒకే రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండింటికీ ఒకే రకమైన పరిస్థితి ఎదురైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడా అదే సిచ్యుయేషన్‌. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఒకే అభ్యర్థికి ఓటేయబోతున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం మమతా బెనర్జీ ఏర్పాటుచేసిన మీటింగుకి రావాలంటూ టీఆర్ఎస్‌కి ఆహ్వానం అందినా ఎవరూ వెళ్లలేదు.

TRS : టీఆర్ఎస్‌‌లో సెగలు రేపుతున్న పాత పగలు? |

కాంగ్రెస్‌ పార్టీని కూడా పిలిచినందున మేము రాము అని ముందే తేల్చిచెప్పారు. కామన్‌ క్యాండేట్‌ ఎవరో వెల్లడిస్తే సపోర్ట్‌ చేస్తామని మాత్రం హామీ ఇచ్చారు. ఆ మేరకు విపక్షాలు సెలెక్ట్‌ చేసిన యశ్వంత్‌ సిన్హాకి ఓఎస్‌ అనేశారు. ఆయన నామినేషన్‌ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం వెళ్లివచ్చారు. లాంఛనప్రాయంగా యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఎనలేని స్వాగతం పలికింది. స్వయంగా సీఎం కేసీఆరే ఎయిర్‌పోర్టుకి వెళ్లి వెల్‌కం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ కూడా యశ్వంత్‌ సిన్హాకే సై అనటంతో తెలంగాణ శాఖ సైతం మారుమాట్లాడలేకపోయింది.

యశ్వంత్‌సిన్హా హైదరాబాద్‌ వచ్చినప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఆయన్ని మర్యాదపూర్వకంగానైనా కలవలేదు. పైగా యశ్వంత్‌ సిన్హాకి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లిన సీనియర్‌ నేత వి.హనుమంతరావుని తప్పుపట్టారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే బండకేసి కొడతామని కూడా అన్నారు. అది వేరే పంచాయితీకి దారితీసింది.

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు యశ్వంత్‌ సిన్హాని ప్రత్యేకంగా కలిసి మద్దతు తెలుపుతారో లేదో తెలియదు కానీ ఓటు మాత్రం ఆయనకే వేయాల్సిన పరిస్థితి. అంటే రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏపీలోని రెండు ప్రధాన పార్టీల మాదిరిగానే తెలంగాణలోని రెండు ప్రధాన పార్టీలు కూడా ఒకేలా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రాలు వేరైనా, పార్టీలు వేరైనా ఒకే రాజకీయం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి. ఇదీ సంగతి.

YCP : అక్కడికి కొత్త అధికారులు వస్తే పెద్ద సారుకు సెల్యూట్ కొట్టాల్సిందే! |

Exit mobile version