YSRCP Election Boycott : సర్పంచ్ సీటుపై రిజర్వేషన్ రగడ.. ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ
- సంబేపల్లిలో రిజర్వేషన్ వివాదం
- వైసీపీ మద్దతుదారుల ఎన్నికల బహిష్కరణ
- పోలింగ్ ఏజెంట్ల అడ్డగింతపై ఆరోపణలు
- రోడ్డుపై అభ్యర్థుల నిరసనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీ రిజర్వేషన్ కేటాయించిన సర్పంచ్ స్థానానికి బీసీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టారనే వివాదం ఈ ఉద్రిక్తతకు దారితీసింది. దీనికి టీడీపీ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరించడంతో పరిస్థితి వేడెక్కింది. ఎన్నికల ప్రక్రియ సందర్భంగా తమపై దాడులు జరిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్‌లోకి తమ ఏజెంట్లను అనుమతించలేదని, పలు ఇబ్బందులకు గురిచేశారని వారు ఆరోపించారు. అలాగే పోలీసుల తీరు పట్ల కూడా స్థానికంగా అసంతృప్తి వ్యక్తమైంది.
రైల్వే కోడూరు, సుండుపల్లెలోనూ ఉద్రిక్తత.. రోడ్డుపై నిరసనలు
రిపోర్టర్ శివానంద రెడ్డి అందించిన సమాచారం ప్రకారం సంబేపల్లితో పాటు రైల్వే కోడూరు, సుండుపల్లె, టీ కమ్మపల్లె ప్రాంతాల్లోనూ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. పలుచోట్ల అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపగా, పోలీసులు వారిని చెదరగొట్టే చర్యలు చేపట్టారు. ఈ పరిణామాలతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం కలకలం రేపింది. మరోవైపు కడప జిల్లాలో మొత్తం 176 గ్రామ పంచాయతీలకు గాను 46 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 130 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
Also Read
- AP Local Body Elections : నంద్యాలలో రాజకీయ కారం.. టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.!
- CM Chandrababu : శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు
- CM Chandrababu : ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఓటు.. ఓటును ఆయుధంగా వాడుకోవాలని పిలుపు
- AP Local Body Elections 2026 : ఏపీలో తొలి విడత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. 709 పంచాయతీలు ఏకగ్రీవం!
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!
-
Amit Shah: రామాయణ టీమ్‌తో అమిత్ షా భేటీ.. రణ్‌బీర్, సాయిపల్లవికి అభినందనలు
-
YSRCP Election Boycott : సర్పంచ్ సీటుపై రిజర్వేషన్ రగడ.. ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ
-
US Birthright Citizenship Row: ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ.. జన్మహక్కు పౌరసత్వంపై అమెరికా కోర్టు కీలక తీర్పు
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
ట్రెండింగ్
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!
-
Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!