Site icon NTV Telugu

Samajika Nyaya Bheri : మూడో రోజు సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర

Samajika Nyaya Bheri

Samajika Nyaya Bheri

వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ఇవాళ మూడో రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు పోలీస్ ఐలాండ్ సెంటర్ లో విగ్రహాలకు నివాళులు అర్పించి మూడో రోజు యాత్ర ప్రారంభించనున్నారు మంత్రుల. ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. 10.00 గంటలకు నారాయణపురం.. 10.45 కు ఏలూరు బైపాస్ మీదుగా 11.30 కి గన్నవరం చేరుకుంటుంది. 12.15కు విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు మంగళగిరి వరకు యాత్ర సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 1.30కి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మంత్రులంతా భోజనం చేయనున్నారు.

మధ్నాహ్నం మూడు గంటలకు యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. 3.15కి గుంటూరు బైపాస్ మీదుగా 4 గంటలకు చిలకలూరిపేట చేరుకుంటుంది. సాయంత్రం 4.30 నర్సరావుపేటలో మంత్రులు బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో ఈరోజు యాత్ర ముగియనుంది. అయితే.. మంత్రులకు ఘనంగా స్వాగతం పలుకేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి, ఇతర నేతలు ఏర్పాట్లు చేశారు.

Exit mobile version