స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సొమ్మును షెల్ కంపెనీల పేరుతో దోచేశారు.. కిలారి రాజేశ్, పెండ్యాల శ్రీనివాస్‌లకు నోటీసులిచ్చారు.. స్కిల్ స్కామ్‌తో సంబంధంలేదని చంద్రబాబు నిరూపించుకోవాలి అని ఆయన సూచించారు. చంద్రబాబు ఆఫ్రూవల్‌తోనే నిధులు రిలీజ్ అయినప్పుడు ఆయనే A1 అవుతారు.. ముఖ్యమంత్రి ప్రధాన పాత్రధారి అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి.. ఫేక్ ఇన్వాయిస్‌లతో 241 కోట్ల రూపాయలు దోచేశారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.
Read Also: Harish Rao: బీజేపీకి ఓటు వేసినా.. మోరిలో వేటు వేసిన ఒకటే
రాజకీయ కక్షసాధింపు అని టీడీపీ ఎదురుదాడి చేసింది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గంటా సుబ్బారావును 5 పదవుల్లో కూర్చోబెట్టారు.. తాను ముసలాడినని, రాజకీయంగా సానుభూతి సంపాదించాలని చంద్రబాబు కోరుకుంటున్నారు.. అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేతలకు దీపావళి ఇవాళే వచ్చిందా అన్నంతగా ఉంది.. బెయిల్ వస్తే దోషి కాదు అనే తప్పుడు మెసేజ్ ప్రపంచానికి ఇస్తున్నారు టీడీపీ నేతలు అని ఆయన మండిపడ్డారు. బెయిల్ పై భాష్యం చెప్పాల్సిన అవసరం లేదు.. చంద్రబాబుపై కేసులు అలాగే ఉన్నాయి.. చంద్రబాబును అరెస్టు చేయకపోయతే ఏమౌతుందో అందరూ ముందే చూశారు అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Read Also: World Cup 2023 Final: ప్రపంచకప్ ఫైనల్‌లో భారత ఓటమిని తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
ఇక, క్వాష్ పిటిషన్ ఇంకా నడుస్తోంది.. ఇంతలో చంద్రబాబుకు గుండె జబ్బు సహా అన్ని రోగాలు వచ్చాయని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు లోపలున్న ఒకటే.. బయట ఉన్నా ఒకటే.. ఆయన చెప్పుకోవడానికి ఉన్నదేమీ లేదు.. చంద్రబాబు తప్పించుకోలేడు.. క్రిమినల్ చరిత్ర కనిపిస్తున్న వ్యక్తిపై కేసులు అలాగే ఉన్నాయన్నారు.. ఒక్కసారి కూడా కేసులతో తనకు సంబంధం లేదని చంద్రబాబు, అతని పార్టీ కూడా చెప్పడం లేదు అని ప్రభుత్వ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.