ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అయితే నేడు మీడియాతో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆ గట్టా…ఈ గట్టా…? అంటూ ప్రశ్నించారు. మేమైతే పవన్ బీజేపీతోనే ఉన్నారని అనుకుంటున్నామని, ఆయన చేయగలిగింది కూడా ఉందని, జగన్ ఇచ్చిన సలహాలు పరిగణలోకి తీసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపండి అని కొరొచ్చునని సూచించారు. మోడీకి ఒక వినతి ఇచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి అంటూ ఆయన అన్నారు. అఖిలపక్షం పిలవకపోతే ఎదో జరిగినట్లు ఆందోళన చేయడం ఏమిటి..? అని ఆయన ప్రశ్నించారు.
సీపీఎస్ మేమిచ్చిన హామీ…దాని ప్రయత్నం జరుగుతోంది. బాధ్యత గల సంఘాలు మాత్రం అలాంటి ప్రకటనలు చేయవు. వారి వ్యాఖ్యలు ఏ రకంగాను వాళ్ళకి మేలు చేసేవికాదు. వ్యవస్థలో వాళ్ళు కూడా భాగస్వామ్యులు అనేది గుర్తుంచుకోవాలి. చర్చలు జరుగుతున్నాయి…ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాం. ఈ సమయంలో కాస్త సంయమనంగా ఉంటే మంచిది. ప్రతిపక్షం ఒక వ్యవస్థను అడ్డుపెట్టుకుని నడిచింది గతంలో ఎన్నడూ లేదు ఏడా పెడా కేసులు వేయడం వల్ల వ్యవస్థలో సమస్యలు వస్తున్నాయి. అన్నింటికీ న్యాయం జరిగేలా ఉండేందుకు కొన్ని నిర్ణయాలు వెనక్కు తీసుకున్నాం’ అని సజ్జల అన్నారు.