NTV Telugu Site icon

Sajjala Ramakrishnudu: 175కి 175 స్థానాలు గెలిచే దిశగా పని చేయాలి.. టెలి కాన్ఫరెన్స్‌లో సజ్జల

Sajjala Ramakrishna

Sajjala Ramakrishna

Sajjala Ramakrishna Reddy Tele Conference Meeting With Party Observers: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం 175 నియోజకవర్గాల పార్టీ పరిశీలకులతో టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సూచనలు సూచించారు. ఎన్నికల ఏడాదిలో పార్టీ పరిశీలకులు కీలకంగా వ్యవహరించాలని.. వారంలో కనీసం రెండు రోజులు నియోజకవర్గాల్లో ఉండి పని చేయాలని అన్నారు. పార్టీ పరిశీలకులపై సీఎం వైఎస్ జగన్ ఎంతో నమ్మకం, విశ్వాసంతో ఉన్నారన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలకు సంధానకర్తలుగా పని చేయాలని చెప్పారు. జగనన్న సురక్ష, ఓటర్ల జాబితా సవరణ, దొంగ ఓట్లు తొలగింపు, అర్హులైన వారిని ఓటర్లుగా చేర్పించే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. నియోజకవర్గాలలో నెలకొనే సమస్యలు, పార్టీ అంతర్గత వ్యవహారాల విషయాలలో అధిష్టానం తరపున సమన్వయం చేయాలన్నారు. 175 నియోజకర్గాలకు 175 స్థానాలు గెలిచే దిశగా పని చేయాలన్నారు. దాదాపు 68 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని తేలిందని.. వాటిని వెంటనే గుర్తించి తొలగించాలని దిశానిర్దేశం చేశారు.

Taneti Vanitha: దళితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంది వైసీపీ ప్రభుత్వమే

అంతకుముందు.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై సజ్జల ధ్వజమెత్తారు. పవన్ అసలు రాజకీయ నాయకుడే కాదని విమర్శించారు. సినిమా న‌టుడు కాబట్టే.. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ని చదువుతాడని ఎద్దేవా చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ అంటున్నారని, అక్కడే ఆయనొక పెయిడ్ ఆర్టిస్ట్ అని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ప‌వ‌న్‌తో పాటు ఇత‌ర నాయ‌కులంద‌రికీ.. రాజ‌కీయ అజెండా మొత్తం చంద్రబాబు, ఎల్లో మీడియా వద్దే రెడీ అవుతుందన్నారు. దాన్ని మోయడమే వారి పని అని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమం చేపట్టినా.. చంద్రబాబుకు, పవన్‌ కల్యాణ్‌కు మింగుడుపడదని అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసమే తాను పనిచేస్తున్నానని పవన్‌ కల్యాణ్‌ పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చినప్పుడే.. పవన్‌ దివాళాకోరుతనం అర్థమైపోయిందని విరుచుకుపడ్డారు.

Bihar: పెళ్లి వేడుకలో మైక్‌ లో పాట పాడుతూ మహిళ మృతి.. ఏమైందంటే?