Site icon NTV Telugu

Sajjala: తిరుమల లడ్డూ వివాదంపై సజ్జల రియాక్షన్..

Sajjala

Sajjala

Sajjala: తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆరోపణలు చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారన్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడటం కాదు జంతువుల కొవ్వు వాడుతున్నారని ఆరోపణలు చేశారని సీఎం చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఇక, జంతువుల కొవ్వు కలిపారాన్న బాబు ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు. రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తామని చెప్పారు.

Read Also: Software Engineer: పని ఒత్తిడితో డిప్రెషన్.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..

ఇక, టీటీడీ చేసిన టెస్టులో జంతు కొవ్వు ఆనవాలు లేవు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆవులు తినే ఆహారం బట్టి పాలల్లో లక్షణాలు ఉంటాయి.. ఆవులు ఎక్కడైనా మాంసం తింటాయా అని ప్రశ్నించారు. నెయ్యి తయారీ కంటే ముందే పాలు టెస్ట్ చేసి పంపుతారు.. టెస్ట్ చేయకుండా అనుమతి ఇవ్వరు.. టెస్ట్ లో తేడా వస్తే వెనక్కి పంపుతారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు డైరీ యజమాని.. ఆయన అమ్మే దాంట్లో కూడా ఇతర జంతు కొవ్వు ఉంటుందా..? అని పేర్కొన్నారు. ల్యాబ్ రిపోర్ట్ నెగిటివ్ అని వచ్చింది.. కానీ చంద్రబాబు మాత్రం ఇతర జంతు కొవ్వు ఉందంటున్నారు.. దీనిపై సమగ్ర విచారణ జరపాలి.. తిరుమలకు ఉన్న నమ్మకాన్ని పెంచాలి.. ఇలా పొగొట్ట వద్దని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Exit mobile version