NTV Telugu Site icon

Sajjala Ramakrishna: రాష్ట్రాభివృద్ధికి.. మూడు రాజధానులే మార్గం

Sajjala On 3 Capitals

Sajjala On 3 Capitals

Sajjala Ramakrishna Reddy On 3 Capitals: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే.. మూడు రాజధానులే మార్గమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రానికి స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని అన్నారు. విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి ఇతర ప్రయోజనాలు రావాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానులుంటేనే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు.. దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచిందని, ఆదర్శవంతమైన రాష్ట్రంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి.. భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు. సీఎం జగన్‌కు ప్రజాదరణ వెయ్యి రెట్లు పెరిగిందన్నారు.

CM KCR : రైతులు హలం దున్నుడం కాదు.. కలం పట్టి దేశ చరిత్ర మార్చాలి

అదే సమయంలో టీడీపీ, చంద్రబాబుపై సజ్జల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీకి పెట్టుబడులు వస్తుంటే కొందరు ఓర్వ లేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ఇండస్ట్రీలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని, ప్రభుత్వం నిబంధనల ప్రకారమే అనుమతులు ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే విషం కక్కుతున్నారని, ఏ పెట్టుబడి వచ్చినా సీఎం జగన్‌కు బంధువులని అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి పెట్టుబడులు రాకూడదన్నదే ఎల్లో మీడియా తాపత్రయమని, బరితెగించి తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పద్దతి లేకుండా అనుమతులు ఇచ్చిందని దుయ్యబట్టారు. అడ్డగోలుగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటుగా మారిందని.. ఏపీకి ఆదాయం రాకూడదనేదే టీడీపీ, ఎల్లో మీడియా లక్ష్యమని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు తమను బాధ్యుల్ని చేస్తున్నారని సజ్జల విరుచుకుపడ్డారు.

Omega Hospital: నగర ప్రజలకు గుడ్ న్యూస్.. తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి చికిత్సలు