NTV Telugu Site icon

Gannavaram Incident: గన్నవరం ఘటన.. రెచ్చగొట్టింది ఎవరు?

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Gannavaram Incident: గన్నవరం ఘటన కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోంది.. ఈ ఘటనపై రాజకీయం దుమారం రేగుతోంది.. వైసీపీ నేతపై టీడీపీ.. తెలుగుదేశం పార్టీపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.. అయితే, అసలు గన్నవరంలో రెచ్చగొట్టింది ఎవరు? అని ప్రశ్నించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వాళ్లే అరాచకాలు సృష్టించి మా పార్టీని బాధ్యులను చేయాలనే కుట్ర జరుగుతోంది.. గన్నవరం కేంద్రంగా రెండు, మూడు రోజులుగా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి.. టీడీపీ ఆలోచనలోనే ధర్మ యుద్ధానికి దూరం.. షార్ట్ కట్స్ వెతుకుతుంది.. ప్రచారం కోసం తాపత్రయపడుతుందని విమర్శించారు. రిమోట్ కంట్రోల్ ద్వారా వ్యవస్థలను మీడియా ద్వారా మేనేజ్ చేయగలం అని గుర్తించిన వ్యక్తి ఓ మీడియా సంస్థ అధినేత అంటూ మండిపడ్డారు.. ఆయన విపరీత ఆలోచనా ధోరణి మరింత వికృత రూపం దాల్చింది.. నేనే ప్రపంచాన్ని శాసించాలనే స్వభావంతో ఉన్నారు.. దాని విష ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుందన్నారు.

Read Also: Education Ministry Rule: ఒకటో తరగతిలో చేర్చుకునే చిన్నారులకు ఆరేళ్లు ఉండాల్సిందే.. కేంద్రం కొత్త రూల్!

రౌడీయిజం, మీడియా టెర్రరిజం కలిస్తే ఆర్డీఎక్స్ కంటే ప్రమాదం అన్నారు సజ్జల.. రాష్ట్రంలో రోజూ ఈ సవాలు విసురుతూనే ఉన్నారు.. అధికారంలో ఉన్న వారి శల్య పరీక్ష చేయటం వీరి అలవాటు.. టీడీపీ శిక్షణా శిబిరంలో వాళ్ళ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు.. చంద్రబాబు సమక్షంలో ఏ రకంగా మాట్లాడారో చూస్తే అది స్పష్టంగా అర్థం అవుతుంది.. అబద్ధాలు చెప్పి న్యాయ వ్యవస్థను ఎలా తప్పుదారి పట్టించాలో చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడిన తర్వాతే చంద్రబాబు.. పట్టాభిని ఆంబోతును మేపినట్లు మేపుతున్నాడని ఫైర్‌ అయ్యారు.. బూతుల్లో పోటీ పడితే డిస్టింక్షన్ వస్తుందన్నారు.. అసలు గన్నవరం ఘటన జరగకుండా ఉండాల్సిందన్న ఆయన.. మేం సమర్ధించటం లేదు.. కానీ, రెచ్చగొట్టింది ఎవరు? అని ప్రశ్నించారు.. విజయవాడలో ఉండే పట్టాభి గన్నవరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అని నిలదీశారు. వాళ్లు మాట్లాడిన మాటలకు వల్లభనేని వంశీయే స్వయంగా వెళ్లాల్సిన పరిస్థితి.. కానీ, వంశీ వెళ్లకపోవటమే సంయమనం పాటించటంగా తెలిపారు. పోలీసులు టీడీపీ హయాంలో ఉన్నట్లు ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేం ఎంతో సంయమనంతో వ్యవహరించాం అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.