NTV Telugu Site icon

ఉద్యోగుల ఆందోళ‌న బల ప్రదర్శన వంటిదే-స‌జ్జ‌ల‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పీఆర్సీ వ్య‌వ‌హారం ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారిపోయింది.. ఆందోళ‌న‌లో భాగంగా ఇవాళ ఛ‌లో విజ‌య‌వాడ నిర్వ‌హించారు ఉద్యోగులు.. అయితే, ఉద్యోగుల ఆందోళ‌న‌ను ప్ర‌భుత్వం త‌ప్పుబ‌డుతోంది.. ప్రభుత్వం ముందు నుంచి చర్చలకు సిద్ధం అని చెబుతూనే ఉన్నామ‌న్నారు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇటువంటి ఆందోళన వల్ల బహిరంగ ఘర్షణ వాతావరణం ఏర్ప‌డుతుంది త‌ప్ప ఉప‌యోగం ఉండ‌ద‌న్న ఆయ‌న‌.. ఛ‌లో విజ‌య‌వాడ‌ బల ప్రదర్శన చేయటం వంటిదే అని వ్యాఖ్య‌యానించారు.. కోవిడ్ పరిస్థితుల నుంచి పూర్తిగా కోలుకోలేదు.. ఉన్న పరిస్థితుల్లో మెరుగ్గా చేయగలిగిందే చేశాం.. ఈ పరిస్థితులన్నీ వివరించాం.. అయినా మొండి వైఖ‌రి స‌రికాద‌న్నారు.

Read Also: బ్రేకింగ్‌: అస‌దుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు

ఐదేళ్ళకు ఒకసారి పీఆర్సీ వల్ల ఇబ్బందులనే కేంద్ర పీఆర్సీకి వెళ్లాల‌ని నిర్ణయం తీసుకున్నామ‌న్నారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. గత రెండున్న‌రేళ్లుగా ఉద్యోగ భద్రతను నెమ్మదిగా పెంచుకుంటూ వ‌చ్చాం.. ఔట్ సోర్సింగ్ నియామకాలు, జీతాల చెల్లింపులు క్రమబద్దీకరణ చేశామ‌న్నారు.. గతంలో కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి జీవోలు మాత్రమే ఇస్తే.. రెండు, మూడు వేల రూపాయల జీతం నుంచి మెరుగైన జీతాలు ఇచ్చే ప్రయత్నం చేశామ‌ని వివ‌రించారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.