Site icon NTV Telugu

అమర రాజా ఫ్యాక్టరీ ఇక్కడే ఉండొచ్చు.. ఉద్యోగుల కన్నా ప్రాణాలు ముఖ్యం..!

Sajjala

Sajjala

అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది… ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అమర రాజా ఫ్యాక్టరీని వెళ్లిపొమ్మని మేం చెప్పలేదన్నారు.. తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు, కాలుష్య నియంత్రణ మండలి లేవనెత్తిన అభ్యంతరాలను సరి చేసుకుని అమర రాజా ఫ్యాక్టరీ ఇక్కడే కొనసాగవచ్చు అన్నారు.. ఇక, పరిశ్రమలు తరలిపోవాలని మేం కోరుకోం అని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 66 ఫ్యాక్టరీలను మూసివేయాల్సిందిగా అధికారులు నోటీసులు ఇచ్చారు.. అందులో 40 ఫ్యాక్టరీలు మూతపడ్డాయన్నార సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రమాదకర లెడ్ తో నీళ్లు కలుషితం చేస్తూ ఉన్నా చూస్తూ ఊరుకోరు కదా? అని ప్రశ్నించిన ఆయన.. నిబంధనల ప్రకారం నడపకపోతే ఇక్కడ ఉండలేరు అని మాత్రమే అమర రాజాకు చెప్పామని తెలిపారు.. ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో పెట్టినా ఈ సమస్యలు అక్కడి వాళ్లు కూడా అడుగుతారన్న సజ్జల.. ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగుల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యం అన్నారు.

Exit mobile version