తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్‌నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.రూ. 50లక్షలు అందించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ మరణించిన సంగతి తెల్సిందే..
వీరితో పాటు మృతిచెందిన సైనికుల మృతదేహాలను గుర్తుపట్టేందుకు ఆర్మీ అధికారులు డీఎన్‌ఏ టెస్టులు చేసి వారివారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు. సాయితేజ మృతదేహం గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఢీల్లీ నుంచి ఆయన పార్థీవదేహాన్ని చిత్తూరులోని ఎగువరేగడకు తరలించనున్నారు. అనంతరం అక్కడే అంత్య క్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా సాయితేజ సేవలందిస్తున్నారు.
