NTV Telugu Site icon

Sailajanath: ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తారా?

Apcc1

Apcc1

కేంద్రంలో నరేంద్ర మోడీ తీరుపై మండిపడ్డారు ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్. రాహుల్ గాంధీని విచారణ పేరుతో ఈడీ వేధిస్తోంది. రేపు గవర్నర్ బంగ్లా ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. బీజేపీకి అధికారమనే పిచ్చి పట్టింది. విచారించాల్సి వస్తే ముందు బీజేపీ నేతలను విచారించాలన్నారు శైలజానాథ్. భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ఏఐసీసీ కార్యాలయానికి పోలీసులను పంపిస్తున్నారు.

ఏ రోజైన బీజేపీ కార్యాలయాల జోలికి వెళ్ళామా..? నాగపూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయానికి పోలీసులను పంపితే అన్నీ దొరుకుతాయి. రాహుల్ గాంధీని విచారణ పేరుతో 10 గంటలు పైగా విచారిస్తున్నారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా విచారణ పేరుతో వేధిస్తున్నారు. రూ. 2 వేల నోట్లు ఎన్ని ముద్రించారో చెప్పగలరా? రూ. 2 వేల నోట్ల ముద్రణపై అనుమానాలు ఉన్నాయన్నారు.

నేడు బీజేపీ చేసే చర్యలకు రేపు ప్రతిచర్యలు ఉంటాయి. దేశం ఆహార భద్రత సూచిలో పాకిస్తాన్ కంటే కిందకి పోయింది. రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే ఉనికి ప్రమాదంలో పడుతుందని బీజేపీ భయపడుతోంది. ప్రశ్నించే గొంతుకలను అణచి వేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతు ఆత్మహత్యలు, పేదరికం, నిరుద్యోగంపై సమాధానం చెప్పుకోలేక ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. భేషరతుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై కేసులు వెనక్కి తీసుకోవాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

Congress: రాహుల్ గాంధీ ఈడీ విచారణ.. రాజ్ భవన్ ముట్టడికి పిలుపు