Site icon NTV Telugu

Central Government: ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రూ.879.08 కోట్ల నిధులు విడుదల

Central Government

Central Government

Central Government: దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద రూ.7183.42 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఐదో ఆర్థిక కమిషన్ చేసిన సిఫారసుల మేరకు ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన నిధులలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌కు రూ.1132.25 కోట్లు, కేరళకు రూ.1097.83 కోట్లు, ఏపీకి రూ.879.08 కోట్లు విడుదలయ్యాయి. రెవెన్యూ లోటు కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఆర్ధిక సమస్యలతో అల్లాడుతున్న ఏపీకి ఊరట కలగనుంది.

Read Also: Record Fined For Instagram: ఇన్‌స్టాగ్రామ్‌కు రికార్డు స్థాయిలో ఫైన్‌ ..! ఎందకంటే..?

అటు ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2022-23లో ఇప్పటివరకు 14 రాష్ట్రాలకు విడుదల చేసిన పీడీఆర్డీజీ నిధులు రూ. 43,100.50 కోట్లు కాగా మొత్తంగా మంజూరు చేయాల్సిన నిధులు రూ.86,201 కోట్లు. వీటిలో రూ.43,100 కోట్లను ఈ ఆర్ధిక సంవత్సరం తొలి ఆరునెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మిగిలిన మొత్తాన్ని దశల వారీగా చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాల వారీగా విడుదల చేసిన రెవెన్యూ లోటు నిధులను పరిశీలిస్తే.. అసోం-రూ.407.50 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.781.42 కోట్లు, కేరళ-రూ.1,097.83 కోట్లు, మణిపూర్-రూ.192.50 కోట్లు, మేఘాలయా-రూ.86.08 కోట్లు, మిజోరం-రూ.134.58 కోట్లు, నాగాలాండ్-రూ.377.50 కోట్లు, పంజాబ్-రూ.689.50 కోట్లు, రాజస్థాన్-రూ.405.17 కోట్లు, సిక్కిం-రూ.36.67 కోట్లు, త్రిపుర-రూ.368.58 కోట్లు, ఉత్తరాఖండ్-రూ.594.75 కోట్లు, పశ్చిమ బెంగాల్-రూ.1,132.25 కోట్లుగా ఉన్నాయి.

Exit mobile version