ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది.. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.. కామవరపుకోట మండలం ఆడమిల్లి సమీపంలో ఎమ్మెల్యే ఎలీజా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టింది.. అయితే, ప్రమాద సమయంలో వెంటనే బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు.. పెను ప్రమాదం తప్పడంలో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యే ఎలీజా అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.. ఇక, మొన్న జంగారెడ్డిగూడెం టౌన్ సచివాలయం 4 మరియు 5 పరిధిలో 79వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా.. నిన్న లింగపాలెం మండలం వేములపల్లి గ్రామంలోని సీఎస్‌ఐ చర్చిలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.. అయితే, చింతలపూడి శాసనసభ్యులు ఎలీజా కారు ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?