NTV Telugu Site icon

Andhra Pradesh: ప్రత్తిపాడులో రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవదహనం

Accident 2

Accident 2

Andhra Pradesh: కాకినాడ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి కూడా మరణించాడు. మొత్తం ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కంటైనర్‌ను కత్తిపూడి వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ డివైడర్‌ మీద నుంచి దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది. ఇసుక లారీ డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read Also: Firing in Gold Shop: నాగోల్ ఘటన.. 48 గంటలు గడిస్తే గానీ క్లారిటీ ఇవ్వలేమన్న వైద్యులు

ఈ ప్రమాదం జరిగిన వెంటనే కంటైనర్ లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో క్యాబిన్‌లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవదహనం అయ్యారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రెండు లారీలు ఒకదానిలో మరొకటి ఇరుక్కున్నంతగా ఢీకొన్నాయి. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉందని ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. ఎస్సై సుధాకర్ ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.