వర్షాభావ పరిస్థితులపై మరోసారి సీఎం జగన్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదటి రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు మాట్లాడిన సీఎం జగన్, సమావేశం ముగిసిన తర్వాత మరోసారి జిల్లా కలెక్టర్లతో వర్షాల పరిస్థితులపై సమీక్షించారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్షించిన సీఎం జగన్ వారికి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాల, ప్రభావాన్ని అడిగి తెలుసు కున్నారు. సీఎం జగన్.రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తు తగిన చర్యలు తీసుకోవా లన్నారు. అవసర మైన చోట వెంటనే సహాయక శిబిరాలను తెరవాలన్నారు.
సహాయ శిబిరాల్లో అన్నిరకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకో వాలని, వారికి తక్షణ సాయం కింద రూ. వెయ్యి చొప్పున ఇవ్వాల న్నారు. తిరుపతిలో సహాయక చర్యలు కోసం సంబంధిత శాఖలన్నీ వెంటనే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. అవసరమైనంత సిబ్బందిని అందుబాటులో ఉంచు కోవాలని, వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకోసం తగిన న్ని నిధులు అం దుబాటులో ఉన్నాయి.. ఎక్కడా రాజీపడాల్సిన అవసరంలేదని సీఎం అధికారులకు తెలిపారు.
Also Read
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్‌దే.. కఠిన చర్యలకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
- Perni Nani: టెట్ క్వాలిఫై కానివారు మెరిట్ లిస్టులోకి ఎలా..? స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు ఆన్లైన్లో పెట్టే దమ్ముందా?
- Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఏం కావాలన్న వెంటనే అడగాలని నిరంతరం అందుబాటులో ఉంటానని సీఎం తెలిపారు. లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమ నిస్తు… తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బందిని రప్పించుకుని సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచనలు చేశారు.
తాజావార్తలు
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!