Revenue Divisions: కడప, కోనసీమల్లో రెండు రెవిన్యూ డివిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కొత్త జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా కడప, కోనసీమ జిల్లాల్లో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, అమలాపురం డివిజన్లలోని 7 మండలాలను కొత్తపేట రెవెన్యూ డివిజన్ గా ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.
కొత్తపేట రెవెన్యూ డివిజనులో ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలను చేరుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది రెవెన్యూ శాఖ. కడప జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజనుగా పులివెందులను ప్రకటిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. జమ్మలమడుగు, కడప రెవెన్యూ డివిజన్లలోని 8 మండలాలను వేరు చేసి కొత్తగా పులివెందుల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. పులివెందుల రెవెన్యూ డివిజన్ లో సింహాద్రిపురం, లింగాల, తొండుర్, పులివెందుల,వేముల,వెంపల్లి, చక్రాయపేట, వీరపునాయునిపల్లె మండలాలను చేరుస్తూ నోటిఫికేషన్ జారీచేసింది.
Also Read
- Sheikh Mohammed Mustafa: గుజరాత్లో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్!
- Gannavaram Bus Accident: గన్నవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌పై బోల్తా పడిన ప్రైవేట్ బస్సు!
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎయిర్‌పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
పులివెందుల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో కడపలో 4కు పెరిగాయి రెవెన్యూ డివిజన్లు. కృష్ణా జిల్లాలోని కొత్తగా ఏర్పాటైన ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ లో పామర్రు మండలాన్ని, మచిలీపట్నంలో ఘంటసాల మండలాన్ని మార్పులు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. చిత్తూరు జిల్లాలో నగరి రెవెన్యూ డివిజన్లోని రెండు మండలాలను చిత్తూరు రెవిన్యూ డివిజన్ లోకి మారుస్తోంది. నగరిలోని శ్రీరంగరాజపురం, వెదురు కుప్పం మండలాలను చిత్తూరు రెవిన్యూ డివిజనుకు మార్పు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Sathyathil Sambhavichathu OTT: లంకె బిందెల కోసం తవ్వితే.. ఊరంతా షాక్ అయ్యే నిజం!.. ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్!
-
Bloody Romeo : నాని ‘బ్లడీరోమియో’ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్
-
Sheikh Mohammed Mustafa: గుజరాత్లో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
-
ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
ట్రెండింగ్
-
Refrigerator Tips : మీ రిఫ్రిజిరేటర్ పైన ఎప్పుడూ ఉంచకూడని 7 వస్తువులు ఇవే..!
-
కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
-
Sachin Tendulkar Fielding: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. పాక్ జెర్సీలో బరిలోకి దిగిన సచిన్.. ఈ షాకింగ్ విషయం తెలుసా?
-
Kitchen Hacks : వంటతో చేతులు గరుకుగా మారాయా? ఇలా చేస్తే మళ్లీ మెత్తబడతాయి.!
-
ఇక ఇంట్లోనే థియేటర్.. 120Hz డిస్ప్లే, 12 స్పీకర్లతో 115-అంగుళాల Sony BRAVIA 9 II భారీ 4K TV లాంచ్.!