NTV Telugu Site icon

Gram Panchayats Resolution: మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి.. 5 ఏపీ గ్రామాల తీర్మానం

Gram Panchayats Resolution

Gram Panchayats Resolution

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత.. కొంత కాలానికి మరికొన్ని మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలిపేసింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, అప్పటి నుంచి దానిపై తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది.. పలు సందర్భాల్లో పోలవరం ముంపు మండలాలను తెలంగాణకు తిరిగి ఇచ్చేయాలనే డిమాండ్‌ వినిపించారు.. అయితే, గోదావరి నదిలో భారీ వరద, అదిమిగిల్చిన నష్టం.. పోలవరం ప్రాజెక్టు ఇలా.. మళ్లీ కొత్త చర్చకు దారితీసింది.. తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన ముంపు మండలాలను తిరిగి.. తెలంగాణ రాష్ట్రానికే ఇవ్వాలనే డిమాండ్‌ మరోసారి తెరపైకి వచ్చింది.. గతంలోనే ఇలాంటి డిమాండ్‌ ఉన్నా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు గ్రామ పంచాయతీలు మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి అంటూ తీర్మానం చేయడం రెండు తెలుగు రాష్ట్రాలో చర్చగా మారింది..

Read Also: Jeevan Reddy: ఈడీల పేరుతో మోడీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది

భద్రాచలం పక్కనే ఉన్నా ఐదు గ్రామ పంచాయతీలు.. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ తీర్మానం చేశాయి.. తెలంగాణలో విలీనంపై చర్చించిన పంచాయతీ కార్యవర్గాలు.. చివరకు తమ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంలో కలపాలని ఐదు గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. ఆ ఐదు గ్రామాలు చేసిన తీర్మానం రెండు తెలుగు రాష్ట్రాలు చేసిన తీర్మానం హాట్ టాపిక్‌గా మారాయి.. ఇక, తీర్మానం చేసిన భద్రాచలం పక్కనే ఉన్న ఆ ఐదు గ్రామాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఎటపాక మండలంలో ఈ గ్రామాలు ఉన్నాయి.. మండల కేంద్రమైన ఎటపాకతో పాటు.. పిచుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలు ఈ తీర్మానం చేశాయి. కాగా, గతంలోనూ కొన్ని ఏపీలోని గ్రామపంచాయతీలు మమ్మల్ని ఏపీ నుంచి తెలంగాణలో కలపాలనే డిమాండ్‌తో ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలసిందే.