Site icon NTV Telugu

ఐదుగురు ఐఏఎస్‌లకు హైకోర్టులో ఊరట

AP High Court

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఐదుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు ఊరట లభించింది… ఈనెల 2వ తేదీన ఐదుగురు ఐఏఎస్‌లకు శిక్ష విధిస్తూ సింగిల్‌ బెంచ్‌ జడ్జి ఇచ్చిన తీర్పు ఇచ్చారు.. అయితే.. సింగిల్‌ బెంచ్‌ జడ్జి ఇచ్చిన ఆదేవాలను నిలిపివేసింది డివిజన్‌ బెంచ్.. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్ సింగ్‌, ఐఏఎస్‌ అధికారి ముత్యాల రాజు, శేషగిరి బాబు, కెవీఎన్‌ చంద్రధర్‌ బాబు వేసిన అప్పీల్‌ను స్వీకరించిన హైకోర్టు.. భూ పరిహారం పూర్తిగా అప్పటికే చెల్లించడంతో పాటు తమవంతుగా అధికారులు కోర్టు ఉత్తర్వులు అమలు చేసేందుకు ప్రయత్నించారని భావిస్తున్నట్టు పేర్కొంది. 2వ తేదీన ఐదుగురు ఐఏఎస్‌లకు జైలుశిక్షతో పాటు జరిమానా విధించింది కోర్టు.. జైలు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు నెల రోజులు శిక్ష సస్పెండ్‌ చేసింది. నెల్లూరు జిల్లా తాళ్ళపాకకు చెందిన మహిళకు నష్టపరిహారం చెల్లించకపోవడంపై సీరియస్‌ అయిన హైకోర్టు.. ఏఎండీ ఇంతియాజ్‌కు రెండు వారాల జైలుశిక్ష, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌కు నెల రోజుల జైలుశిక్ష, ముత్యాలరాజుకు రెండువారాల జైలు శిక్ష విధించింది. ఇక, మాజీ ఐఏఎస్‌ మన్మోహన్‌సింగ్‌కు నెల రోజుల జైలు శిక్ష విధించిన హైకోర్టు.. అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ శేషగిరిరావుకు రెండు వారాల జైలు శిక్ష విధించింది. ఇప్పుడు.. సింగిల్‌ బెంచ్ జడ్జి ఆర్డర్స్‌ను డివిజన్‌ బెంచ్‌ నిలిపివేయడంతో.. వారికి ఊరట లభించింది.

Exit mobile version