NTV Telugu Site icon

Undavalli Anusha: ఉండవల్లి అనూషకు ఊరట.. 41A నోటీసుల్ని సస్పెండ్ చేసిన హైకోర్ట్

Anusha

Anusha

ఏపీ హైకోర్టులో టీడీపీ నేత ఉండవల్లి అనూషకు ఊరట లభించింది. ఐటీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకి అనంతపురం పోలీసులు ఇచ్చిన 41A నోటీసులను సస్పెండ్ చేసింది హైకోర్టు. అనూష కు 41 A నోటీసులు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా కోరారు అనంతపురం డిఎస్‌పి. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్. కేసు రిజిస్టర్ చేసి అనూషను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు డిఎస్‌పి.

Read Also: Naga Shourya Marriage : పెళ్లిపీటలెక్కబోతున్న టాలీవుడ్‌ హీరో.. ఎప్పుడంటే..!

41A నోటీసులను హైకోర్టులో సవాల్ చేశారు అనూష తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు. రాజకీయ కక్షతోనే అనూషను విచారణకు పిలిపిస్తున్నారని వాదనలు వినిపించారు. పోసాని వాదనలతో ఏకీభవించింది హైకోర్టు. 41A నోటీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. దీంతో అనూషకు ఊరట లభించింది. ఇటీవలి కాలంలో టీడీపీ నేతల్ని పోలీసులు టార్గెట్ చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ… హైకోర్ట్ తాజా తీర్పు టీడీపీ నేతలకు ఉత్సాహాన్నిచ్చింది.

Read Also:Sajjala Ramakrishna Reddy: ఇప్పటం విషయంలో పవన్‌కు ఆవేశం ఎందుకు..?