NTV Telugu Site icon

KGH Hospital: విశాఖలోని కేజీహెచ్ వద్ద మృతుల బంధువులు, కార్మిక సంఘాలు ఆందోళన..

Kgh

Kgh

విశాఖపట్నంలోని KGH హస్పటల్ వద్ద మృతుల బందువులు, కార్మిక‌ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని.. కనీసం సమాచారం ఇవ్వకపొవడం దారుణం అని బందువులు, కార్మికులు‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు. ఇక, విషయం తెలుసుకున్న విశాఖ కలెక్టర్ హరేంధ్ర ప్రసాద్.. కేజీహెచ్ లో బాధితులతో మాట్లాడారు. పోస్ట్ మార్టంకు సహాకరించాలని కుటుంబ సభ్యులను కలెక్టర్ కోరారు. కోటి రూపాయల ఎక్సగ్రేషియా అందిస్తామని ఆయన వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

Read Also: Tamilaga Vettri Kazhagam : తన పార్టీ జెండా రిలీజ్ చేసిన విజయ్.. ఎలా ఉందో చూశారా?

అలాగే, విశాఖ మెడి కవర్ లో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ప్రమాదంలో గాయపడిన ఏడుగురు కార్మికులు.. నలుగురు పరిస్థితి విషమంగానే ఉందని అధికారులు చెప్తున్నారు. మరొక 24 గంటలు గడిస్తేనే గాని ఏమి చెప్పే పరిస్థితి లేదని వైద్యులు అంటున్నారు. కాసేపట్లో హాస్పిటల్ కి సీఎం చంద్రబాబు రానున్నారు. పేషంట్లును పరామర్శించి వారి హెల్త్ కండిషన్ పై డాక్టర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలలో మొత్తం 35 మంది కార్మికులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. జిల్లా అధికారులతో మానిటరింగ్ కమిటీ సమావేశం అయింది. చికిత్స పొందుతున్న 35 మంది పేషెంట్లు ప్రతి గంటకి హెల్త్ బులిటెన్ పై ఫాలో చేయనున్నారు. ప్రాణనష్టం పెరగకుండా మానిటరింగ్ చేయాలని ఎప్పటికప్పుడు తమకు అప్డేట్ చేయాలని సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ చేశారు. బెటర్ ట్రీట్మెంట్ విషయంలో రాజీ పడకుండా చూడాలని పేర్కొనింది.