Tamilaga Vettri Kazhagam : తన పార్టీ జెండా రిలీజ్ చేసిన విజయ్.. ఎలా ఉందో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Vijay unveils flag of his Tamilaga Vettri Kazhagam political party: కొన్నాళ్ల క్రితం రాజకీయ అరంగేట్రం చేసిన తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ జెండాను విడుదల చేశారు. పనయూర్లోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన అనంతరం పార్టీ యాంథమ్ ను సైతం రిలీజ్ చేశారు. కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం తమ పార్టీ లక్ష్యమని విజయ్ తెలిపారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆయన సిద్ధమవుతున్నారు. త్వరలో తిరుచ్చి వేదికగా భారీ బహిరంగంగా సభను నిర్వహించనున్నారు విజయ్. తమిళగ వెట్రి కళగం యొక్క జెండా ఎరుపు- పసుపు రంగులతో రెండు యుద్ధ ఏనుగులు మధ్యలో సూర్య కిరణాలతో రూపొందించబడింది.
Shraddha Kapoor: ఆ విషయంలో మోదీని వెనక్కి నెట్టిన శ్రద్ధా కపూర్
Also Read
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
- Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
ఈ కార్యక్రమంలో తమిళగ వెట్రి కళగం నేతలు, వాలంటీర్లు, విజయ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయ్ తల్లిదండ్రులు ఎస్‌ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ ఇద్దరూ హాజరయ్యారు. నటుడు విజయ్ గత ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కళగం అనే పార్టీని ప్రారంభించారు. ఇందుకోసం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఆనంద్ ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం వద్ద పార్టీని రిజిస్టర్ చేయించారు. ఆ తర్వాత విడుదల చేసిన ప్రకటనలో 2026 శాసనసభ ఎన్నికలే టార్గెట్ అని కూడా విజయ్ ప్రకటించారు. దీంతో 2 కోట్ల మందిని పార్టీలో చేర్చుకునే పని జోరుగా సాగుతోంది. మెంబర్‌షిప్ రిక్రూట్‌మెంట్‌లో అన్ని స్థాయిల్లోని ఎగ్జిక్యూటివ్‌లు చురుకుగా పాల్గొంటున్నారు. ఇక ఈరోజు కోసమే 19వ తేదీన పనైయూరులోని పార్టీ కార్యాలయంలో మధ్యలో విజయ్ చిత్రం ఉన్న పార్టీ జెండాను ఎగురవేసి విజయ్ రిహార్సల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!