NTV Telugu Site icon

Kurnool Crime: పెళ్లి పీఠలెక్కిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. భార్యే భర్తను చంపిందంటున్న బంధువులు

Untitled 1

Untitled 1

Kurnool: సోషల్ మీడియా వచ్చాక ప్రేమ వ్యవహారాలు పెరుగుతున్నాయి. పేస్ బుక్ లో పరిచయం, ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ, వాట్సప్ లో అభిప్రాయాలను పంచుకుంటూ ఒకరినినొకరు అర్ధమే చేసుకోవడం.. ఆపై అర్ధాంతరంగా పెళ్లి చేసుకోవడం.. ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. అయితే ఈ ట్రెండ్ కొందరికి మంచి లైఫ్ ని ఇస్తే ఎందరికో చేదు అనుభవాలని రుచిచూపించి జీవితాన్ని నాశనం చేస్తుంది. సోషల్ మీడియా ప్రేమ కథలు.. ఆ కథలు విషాద సంచికలో చేరిన ఘటనలు గతంలో కోకొల్లలు.. అలాంటి ఘటనే తాజాగా మరోసారి వెలుగు చూసింది. ఇంస్టాగ్రామ్ లో ప్రేమ పెళ్లి పీఠలెక్కిన అతి కొద్ది కాలం లోనే ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

Read also:Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ఈ జన్మకు మారడు.. యుద్ధం అనేది 2019లోనే అయిపోయింది..

ఈ ఘటన కర్నూలులో వెలుగు చూసింది. వివరాల లోకి వెళ్తే.. సత్యసాయి జిల్లా నెలకోట తండాకు చెందిన షణ్ముఖ నాయక్ (21) అనే యువకుడికి గుంతకల్లు మండలం లోని వెంకటాంపల్లి కి చెందిన రమణమ్మతో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడినది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. కాగా రెండు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షణ్ముఖ నాయక్ (21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనితో రమణమ్మనే షణ్ముఖ నాయక్ ని హత్యా చేసిందని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా రమణమ్మ కర్నూలులో బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నది.

Show comments