Site icon NTV Telugu

Rayalaseema Atma Gourava Maha Pradarshana: నేడు రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన

Rayalaseema

Rayalaseema

నేడు తిరుపతిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ ర్యాలీకి సిద్ధమైంది.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన నిర్వహించనున్నారు.. ఇప్పటికే తిరుపతికి చేరుకుంటున్నారు రాయలసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత…. మూడు రాజధానులు/రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గుండె చప్పుడు వినిపిస్తూ మహా ప్రదర్శన.. ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి.. స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద నుంచి ప్రారంభం కానున్న మహా ప్రదర్శన.. గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు మీదుగా నగర పాలక సంస్థ కార్యాలయం వరకు వేలాదిమందితో కొనసాగుతుందని.. తిరుపతి మున్సిపల్ కార్యాలయం సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి..

Read Also: Faria Abdullah: ‘లైక్ షేర్ & సబ్స్క్రైబ్’ అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్..

కాగా, మూడు రాజధానులపై ముందుకు సాగుతూనే ఉంఇ అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ… ప్రజల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగిస్తోంది.. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలతో విశాఖ గర్జన జరగగా.. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలోనూ ఉ్యమానికి శ్రీకారం చుట్టింది… తిరుపతి వేదికగా ఇవాళ మహా ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.. రాయలసీమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం.. పదండి.. అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. రాయలసీమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రజలు అందరూ సంఘీభావం ప్రకటించేందుకు సిద్దంగా ఉన్నారన్న భూమన.. పరిపాలన వికేంద్రీకరణకు విద్యార్థులు, ప్రజలు.. సీఎం వైఎస్‌ జన్మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. రాయలసీమ ఆత్మగౌరవం యాత్రకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం… ఇలాంటి విషయాల్లో రాజకీయం సరికాదు.. రాయలసీమకు ద్రోహం చేయొద్దు అని హితవుపలికారు..

Exit mobile version