Ratan Tata Innovation Hub: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా మార్చాలనే పట్టుదలతో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే, ఇవాళ ( ఆగస్టు 20న) ఉదయం 11 30 గంటలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభోత్సవం చేయనున్నారు. విజయవాడలోని ఎనికేపాడులో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్ చేయనున్నారు. ఇక, స్టార్టప్ కంపెనీలకి మౌలిక సదుపాయాల కల్పన.. ఆర్ధిక పరమైన వనరుల సహకారం ఇన్నోవేషన్ హబ్ అందించనుంది. అలాగే, టెక్నాలజీ,హెల్త్ కేర్ రంగాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టనుంది.
Read Also: Godavari Floods: ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
అలాగే, రాష్ట్రంలో ఆవిష్కరణలు, స్టార్టప్, నైపుణ్య అభివృద్ధి, ఉపాధిని ప్రోత్సహించాలనే టార్గెట్ తో రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సిలికాన్‌వ్యాలీ తరహా ఎకోసిస్టమ్‌ను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిలో రాష్ట్ర సర్కార్ పూర్తి సహకారంతో తొలి హబ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీని ద్వారా స్థానిక పెట్టుబడిదారులకు ప్రత్యేక గుర్తింపుతో పాటు యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే, యువతను ఉద్యోగాల కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా చేస్తామని రతన్‌టాటా సంస్థ వెల్లడించింది. వనరుల కల్పన, నెట్‌వర్క్ ఛాన్స్, ప్రోగ్రాం రూపకల్పనకు ఈ ఇన్నోవేషన్ హబ్స్ ఉపయోగపడతాయని పేర్కొంది.
