Site icon NTV Telugu

Rammohan Naidu : రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం పాలన సాగిస్తున్నారు

TDP MP Rammohan Naidu Made Comments on CM Jagan.

ఆర్టికల్ 360 ఉపయోగించాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో దాపురించాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై కేంద్రం పరిశీలించి అవసరమైతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి ఏపీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుండి ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసకర పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. జగన్ ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్ లేకుండా చేస్తున్నారు అని అనేక సార్లు మేము చెప్పిన విషయాన్ని కాగ్ నివేదిక మరోమారు స్పష్టం చేసిందన్నారు. 48 వేల కోట్ల రూపాయలను ఎందుకు ఖర్చు పెట్టారు ఎలా పెట్టారు ఏమయ్యాయి అని, ట్రెజరీ కోడ్ ఉల్లంఘించారు అని కాగ్ పేర్కొందన్నారు.

రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సొంత కంపెనీ లాగా భావిస్తున్నారని, రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం పాలన సాగిస్తున్నారు జగన్ రెడ్డి అంటూ ఆయన మండిపడ్డారు. నాయకత్వం లేదు, విజన్ లేదు ఒక కంపెనీ ముందుకు వచ్చే పరిస్థితి లేదు, ఎవరైనా ముందుకు వచ్చిన వాళ్ల నుంచి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పన్నులు వేసి ప్రజలను పిండి పిండి చేస్తున్నారని ఆయన ఆయన ధ్వజమెత్తారు.

https://ntvtelugu.com/margani-bharath-made-comments-on-tdp/
Exit mobile version