రామచంద్రాపురంలో జరిగిన ఘటనతో తాతాల్కికంగా తమ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు అమరావతి రైతులు.. పాదయాత్రకి నాలుగు రోజులు విరామం ప్రకటించారు.. పోలీసులు తీరుకు నిరసనగా పాదయాత్ర నాలుగు రోజులు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు… పోలీసుల తీరుపై కోర్టులో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చిన రైతులు.. ప్రస్తుతం కోర్టుకి సెలవులు ఉన్న నేపథ్యంలో.. తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చామన్నారు.. అయితే, ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి.. అమరావతి రైతుల మహాపాదయాత్రను పోలీసులు ఆపలేదని స్పష్టం చేశారు.. దీనిపై అమరావతి రైతులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఆయన.. పోలీసులే రైతుల ఐడీ కార్డులు చించివేశారని అనడం చౌకబారు ఆరోపణ అని కొట్టిపారేశారు..
Read Also: Simona Halep: డోప్ టెస్టులో దొరికిన టెన్నిస్ స్టార్.. నిషేధం విధింపు
600 మంది మాత్రమే ఐడీ కార్డులతో వస్తే ఇప్పుడే అనుమతి ఇస్తాం అన్నారు డీఎస్పీ బాలచంద్రారెడ్డి… సంఘీభావం తెలిపే వారు మాత్రం రోడ్డుకి ఇరువైపులా నిలబడాలని స్పష్టం చేశారు.. మేం రైతులకు సపోర్ట్ చేస్తున్నామని వెల్లడించారు రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి.. కాగా, అమరావతి రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత నెలకొన్ని విషయం తెలిసిందే.. రామచంద్రాపురం విజయ ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది.. హైకోర్టు ఆదేశాలకు లోబడి పాదయాత్ర చేయాలని పోలీసులు ఆంక్షలు విధించారు.. ఐడీ కార్డులు ఉన్న 600 మందికి, నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతి అని స్పష్టం చేశారు పోలీసులు.. అమరావతి రైతులు మినహా బయటవారు పాదయాత్రలో పాల్గొనకూడదని తేల్చేశారు.. అయితే, నిన్నటిలాగే ఇవాళ కూడా పాదయాత్ర అడ్డుకుంటున్నారని పోలీసులతో అమరావతి రైతులు వాగ్వాదానికి దిగారు.. ఆ తర్వాత పాదయాత్ర నాలుగు రోజుల పాటు పాదయాత్రను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.