NTV Telugu Site icon

హిందూపురంలో చేనేత కార్మికుల కష్టం నీటిపాలు

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని కొట్నూర్ వద్ద వర్షపు నీరు ఇళ్ళ లోకి చేరి చేనేత కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. నేషనల్ హైవే కాంట్రాక్టర్ అక్కడ ఉన్న కాలువను మట్టితో కప్పేయడం తో వర్షపు నీరంతా ఇళ్లల్లోకి చేరి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వర్షం పడిందంటే ఉపాధి కోల్పోయి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కోడూరు గ్రామానికి చెందిన కార్మికులు వాపోతున్నారు. తమ ఇంటి పక్కనే నేషనల్ హైవే పనులు జరుగుతుండడంతో ఉన్న ఇరిగేషన్ కాలువను మట్టితో పూడ్చి వేశారన్నారు.

దీంతో వర్షం పడినప్పుడు వర్షపు నీరు అంతా తమ ఇళ్లలోకి రావడంతో చేనేత ని నమ్ముకున్న తమకు ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కు సంబంధించిన రేశం పోగు సుమారు లక్ష రూపాయలు విలువచేసే వర్షపు నీటితో తడిసిన తమకు నష్టం జరిగిందన్నారు. రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కి తమకు జరిగిన అన్యాయం తెలిపినప్పటికీ వారు మమ్మల్ని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తమకు జరిగిన నష్టాన్ని గుర్తించి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు.