NTV Telugu Site icon

Monsoon: చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు..

Ap Telangana Rains

Ap Telangana Rains

Heavy rains in Telugu states for 5 days: తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల రాకతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రానున్న 3, 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

Read also: Rohit Sharma Record: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!

రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సెరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో నగరం అంతా కిక్కిరిపోయింది.

Read also: Rohit Sharma Record: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!

మరోవైపు అల్లూరిజిల్లా ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ఈ ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కి.మీ ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రుతుపవనాలు నేడు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని నారాయణపేట, ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం మీదుగా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వీటి ప్రభావంతో రానున్న 3 నుంచి 4 రోజుల్లో తెలంగాణ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

JC Prabhakar Reddy: మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా.. జేసీ సంచలన ప్రకటన