Site icon NTV Telugu

Raghuramakrishna : ఏపీ ఆర్థిక పరిస్థితిపై విచారణ జరిపించాలి

వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ సారి లేఖలో ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ.. విచారణ జరిపించాలని కోరారు. ఇటీవల ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ ఇచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకోని సీబీఐ ఆర్థిక నేర విభాగంతో గానీ, లేదంటే సీరియ‌స్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో)తో విచార‌ణ జరిపించాలని లేఖ‌లో ప్ర‌ధానికి కోరారు. అంతేకాకుండా ప్ర‌భుత్వ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాల‌పైనా విచార‌ణ చేప‌ట్టాలని, కార్పొరేష‌న్ల ద్వారా ఎలా సేక‌రించారో విచారించాలని డిమాండ్‌ చేశారు. అప్పులు తీసుకునేట‌ప్పుడు ఏపీ ప్ర‌భుత్వం రాజ్యాంగ ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిందని ఆయన ఆరోపించారు. దీనితో పాటు ఏపీ ఆర్థిక ప‌రిస్థితిపై విచార‌ణ జ‌రిగే స‌మ‌యంలో సీఎం జగన్, అధికారులను సైతం ప్ర‌శ్నించేలా నిబంధ‌న విధించాల‌ని ర‌ఘురామ‌రాజు డిమాండ్ చేశారు.

Exit mobile version