ఏపీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. దీంతో ప్రభుత్వం తన తప్పు తెలుసుకుంది. స్మార్ట్ సిటీ ఛైర్మన్ల పదవులకు గండం ఏర్పడింది. ఈ నియామకాల్లో న్యాయపరమైన చిక్కులు తప్పేలా లేవు. దీంతో స్మార్ట్ సిటీ ఛైర్మన్ల వరుస రాజీనామాలకు తెరతీసింది ప్రభుత్వం. జీవీఎంసీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ రాజీనామా చేశారు.
సాంకేతికంగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్లు నియామకాలు చెల్లవని ఆలస్యంగా గుర్తించింది రాష్ట్రప్రభుత్వం. స్మార్ట్ సిటీ కార్పోరేషన్ల ఛైర్మన్లు రాజీనామా చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. విశాఖ, తిరుపతి, కాకినాడ, ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ ల రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. స్మార్ట్ సిటీ కార్పోరేషన్ల పేరుతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. కాకినాడలో మోడరనైజేషన్ పేరుతో భారీ మొత్తంలో ఖర్చు చేశారు. ఉపనదుల్లో డ్రెడ్జింగ్ పేరిట లెక్కా పత్రం లేకుండా నిధులు వినియోగించారు. రాజకీయ పునరావాసం కోసమే కులాల పేరిట కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
స్మార్ట్ సిటీల ఛైర్మన్ నియామకాలు చెల్లవని ప్రభుత్వానికి ఇప్పటికి తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చెంప పెట్టు అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. తప్పు తెలుసుకుని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ల ఛైర్మన్లతో సీఎం రాజీనామా చేయించారు. టీటీడీ బోర్డును సైతం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. తిరుమలలో సామాన్య భక్తులకు దర్శనాలు దొరకని పరిస్థితి నెలకొంది. టీటీడీ నిబంధనల ప్రకారమే సభ్యులను నియమించాలి.
ప్రత్యేక ఆహ్వానితుల ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలి. టీటీడీ ఆస్తులను ప్రభుత్వం లాక్కుంది. ప్రభుత్వం తీసుకున్న ఆస్తులు తక్షణమే వెనక్కి ఇచ్చేయాలి. సీపీఎస్ పై మాట్లాడేందుకు ప్రభుత్వానికి ధైర్యం లేదు. ప్రభుత్వానికి ధైర్యముంటే సీపీఎస్ రద్దు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.