Site icon NTV Telugu

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్..

Vizag Steel Plant

Vizag Steel Plant

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం… వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం.. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని.. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది.. ఇక, ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని పేర్కొన్న కేంద్రం.. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది… ఉద్యోగులు ప్లాంటు అమ్మవద్దనడం సరికాదు.. 100 శాతం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాలు జరుగుతాయని…. ఇప్పటికే బిడ్డింగ్‌లు ఆహ్వానించామని.. అసలు, ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని అఫిడవిట్‌లో హైకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. దేశ ఆర్థిక అవసరాలపై తీసుకున్న నిర్ణయాలపై విచారణ తగదని.. పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో సుప్రీం కోర్టు తీర్పులున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేసింది..

Exit mobile version