NTV Telugu Site icon

Hospital Seize: జంగారెడ్డిగూడెంలో ఆ ఆస్పత్రి సీజ్

Hospital

Hospital

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రైవేటు ఆస్పత్రి ఏలూరు జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రికి తాళం వేశారు. గిరిజన విద్యార్ధి , కబాడీ ప్లేయర్ అయిన మోడియం మంగ మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారులు విచారణ వేగవంతం చేసారు. ఇదే క్రమంలో పేషెంట్ మంగ మృతి చెందిన ఆసుపత్రిని డి.ఎంఅండ్ హెచ్ వో ఆధ్వర్యంలో వైద్యాధికారులు సీజ్ చేసారు. అనంతరం ఇద్దరు ప్రభుత్వ వైద్యులని విధుల నుండి తప్పించారు.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనికి కారణం అయిన చిరంజీవి ఆసుపత్రిపై వైద్యాధికారులు కొరడా ఝుళిపించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి లో విచారణ చేసి అనంతరం ఆసుపత్రి యాజమాన్యానికి నోటిసులు జారీచేసారు. 45 రోజుల పాటు చిరంజీవి ఆసుపత్రిలో ఎటునటి ఓ.పి (ఔట్ పేషెంట్ విభాగం ) , ఐ .పి విభాగాలు పనిచేయకూడదని, వాటిని వెంటనే నిలుపుదల చేయాలి అని నోటిస్ లో పేర్కొన్నారు.

MS Dhoni: ధోనీకి మోకాలి శస్త్రచికిత్స.. ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

అలాగే ఆసుపత్రి లో ఉన్న వైద్యుల వివరాలు తెలిపే పట్టిక లేదని , ఆసుపత్రిలో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో అన్ని వేరువేరు గదులు నిబంధనల ప్రకారం ఉండాలని ఆదేశించారు. అక్కడ అన్ని నిబంధనలు తుంగలో తొక్కారు. ఆసుపత్రిలో అల్ట్రా సౌండ్ సిస్టం , ల్యాబ్ లాంటి సదుపాయాలు కానీ లాబ్ లో పని చేసే వారికీ ఎటువంటి అనుమతి పత్రాలు కానీ లేవు. అనుభవం లేకపోవడంతో జిల్లా వైద్యాధికారులు విచారణ జరిపారు. దీనితో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆసుపత్రిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ విషయాలపై 45 రోజుల లోపు చిరంజివి ఆసుపత్రి యాజమాన్యం వివరణ కోరినట్లు , ప్రస్తుతానికి ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్న నేత.. అయోమయంలో క్యాడర్