తూర్పు నావికాదళం నిర్వహిస్తున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కి అంతా రెడీ అయింది. సోమవారం ఉదయం 9 గంటలకు రివ్యూ ప్రారంభం కానుంది. ఈ సమీక్షలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రమే విశాఖ వచ్చారు. ఆయనకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతికి సీఎం జగన్ ప్రత్యేకంగా జ్ఞాపికను బహూకరించారు.
- 9కి ప్రారంభం కానున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ
- 9.07 కి ఐ ఎన్ ఎస్ సుమిత్ర ను అధిరోహించనున్న రాష్ట్రపతి
- 9.34 నుంచి 10. 43 వరకు యుద్ధ నౌకల సమీక్ష, మధ్యలో పెరేడ్ సెయిల్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ డెమో, హాక్ డెమో
- 10.44 నుంచి 10. 52 వరకు ఫ్లై ఫాస్ట్, ఏకకాలంలో ఎగిరి సుప్రీం కమాండర్ కి సెల్యూట్ చేయనున్న యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు
- 10.53 నుంచి 10.57 వరకు సబ్ మెరైన్ ల సమీక్ష
- 10.58 నుంచి 11.02 వరకు మెరైన్ కమాండో ల విన్యాసాలు
- 11.08 నుంచి 11.13 వరకు రాష్ట్రపతి ప్రసంగం
నౌకాదళ అధికారులతో గ్రూప్ ఫొటో, తపాలా బిళ్ల, పోస్టల్ కవర్ ఆవిష్కరణ తర్వాత 11.45 కి విశాఖ నుంచి నిష్క్రమించనున్నారు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.