Droupadi Murmu : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నవంబర్ 20న తిరుపతికి రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె 21న శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటనలో భాగంగా ముర్ము నవంబర్ 20న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం తిరుమలకు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు 21న ఆలయ సంప్రదాయం ప్రకారం మొదట శ్రీ వరాహస్వామివారి, ఆ తరువాత కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుంటారు.
Caste Expulsion: జనగామ జిల్లాలో కుల బహిష్కరణ కలకలం.. డీసీపీ కార్యాలయంకు చేరిన పంచాయితీ!
ఈ పర్యటనను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనంలో నవంబర్ 6న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి అధ్యక్షత వహించారు. సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు. భద్రత, వసతి, దర్శన, ప్రోటోకాల్ ఏర్పాట్లపై అధికారులు సమీక్ష జరిపారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో ఆదేశించారు.
Dil Raju: ప్రెస్‌మీట్స్ పెట్టడం, ట్రైలర్స్ లాంఛ్ చేయడం గొప్పకాదు.. అసలైన టాస్క్ అదే!
