Site icon NTV Telugu

Prepaid Card for Kamineni: కామినేని హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్‌కి ప్రిపెయిడ్ కార్డు

Prepaid Card For Kamineni

Prepaid Card For Kamineni

Prepaid Card for Kamineni: కామినేని ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్‌ కోసం ప్రీపెయిడ్‌ వ్యాలెట్‌ బ్యాలెన్స్‌ కార్డును అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఆఫర్డ్‌ ప్లాన్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్డును ఉపయోగిస్తే క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. మందుల పైన, మెడికల్‌ టెస్టుల పైన డిస్కౌంట్‌ ఇస్తారు. 10 వేల రూపాయలు మొదలుకొని 10 లక్షల రూపాయల వరకు మెడికల్‌ లోన్‌ కూడా అందిస్తారు. ఈ కార్డుల్లో డబ్బులను సేవింగ్‌ డిపాజిట్‌ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవాలని, 40 వేల రూపాయల వరకు ప్రమాద బీమా కూడా ఉందని ఆఫర్డ్‌ ప్లాన్‌ సీఈఓ తెలిపారు.

ఫైన్ కట్టిన ఎన్డీటీవీ

సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు ఎన్‌డీటీవీ.. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాకి 10 లక్షల రూపాయల జరిమానా చెల్లించింది. షేర్‌ హోల్డర్ల ప్రయోజనాల కోసమే పేమెంట్‌ చేసి, ఇష్యూని సెటిల్‌ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్‌డీటీవీ ఫౌండర్‌-ప్రమోటర్లు తీసుకున్న లోన్‌ వివరాలను వెల్లడించకపోవటంతో మార్కెట్‌ రెగ్యులేటర్‌.. ఎన్‌డీటీవీకి 5 కోట్ల రూపాయల ఫైన్‌ విధించగా దాన్ని ట్రిబ్యునల్‌ 10 లక్షల రూపాయలకు తగ్గిస్తూ జులై 20వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది.

Shock News to Samsung: శామ్‌సంగ్‌కి కేంద్ర ప్రభుత్వం షాక్‌

చిన్న సిటీల్లో పెద్ద డిమాండ్‌

ఇండియాలోని చిన్న నగరాల్లో 5జీ ఎనేబుల్డ్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు 40 శాతం డిమాండ్‌ పెరిగినట్లు ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. గుంటూరు, హిసార్‌, మొరాదాబాద్‌, షాజహన్‌పూర్‌ తదితర టయర్‌-2 సిటీల్లో ప్రజలు ఎక్కువ శాతం వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంది. ఈ ఫోన్లకు ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో ఓవరాల్‌గా 25 శాతం గిరాకీ నెలకొన్నట్లు వెల్లడించింది. యాపిల్‌, శామ్‌సంగ్‌, గూగుల్‌ పిక్సెల్‌, ఒప్పో వంటి ప్రీమియం బ్రాండ్లు లాంఛ్‌ చేసిన కొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో 60 శాతానికి పైగా వృద్ధి నమోదైనట్లు ఫ్లిప్‌కార్ట్‌ గుర్తించింది.

ఇదిలా ఉండగా.. కౌంటర్‌పాయింట్‌ అనే రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో.. ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య ఏప్రిల్‌-జూన్‌ మధ్యలో 600 మిలియన్‌ మార్క్‌ దాటినట్లు తేలింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జరిగిన మొత్తం షిప్‌మెంట్లలో 5జీ ఫోన్ల వాటా గతంలో ఎన్నడూ లేనంతగా 29 శాతానికి చేరటం విశేషం.

Exit mobile version