NTV Telugu Site icon

Pregnant Women: ఏజెన్సీ గ్రామాల్లో గర్భిణీలకు తప్పని డోలీ కష్టాలు.. కడుపులోని పసికూన మృతి

Pregnant Women

Pregnant Women

Pregnant Women: ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు కనీస సదుపాయాలు లేక… డోలీలనే నమ్ముకోవాల్సి వస్తుంది. ఈ ప్రయాణం వారి ప్రాణాల మీదకు కూడా తెలుస్తోంది. అల్లూరి జిల్లా ఏజెన్సీలో డోలీలో ఆస్పత్రికి వెళ్లిన ఓ తల్లి… కడపులోనే బిడ్డను కోల్పోయి కన్నీరుమున్నీరవుతోంది. అల్లూరి జిల్లా హుకుంపేట మండలం పనసబంద గ్రామానికి చెందిన గర్భిణి బానుకు ఈ ఉదయం పురిటి నెప్పులు వచ్చాయి. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో… గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డోలీ కట్టి ఆమెను ఆస్పత్రికి తరలించారు. డోలీలో రావడం వల్ల… కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని వైద్యులు తెలిపారు. డెలివరీ చేసి… ప్రాణం లేని బిడ్డను అప్పగించారు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండి ఉంటే.. తమ బిడ్డ బ్రతికేదని ఆవేదన చెందుతున్నారు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

కాగా, ఏపీలోని గిరిజ‌న గ్రామాల్లో మ‌హిళ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.. స‌రైన ర‌హ‌దారి సౌక‌ర్యం లేక ఆసుప‌త్రికి వెళ్లాలంటే న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. గ‌ర్భిణీ స్త్రీలు ఆసుప‌త్రికి వెళ్లాలంటే డోలీలే ఇప్పటికీ దిక్కుగా మారాయి.. గిరిజ‌న‌ల‌పై మాట‌ల‌తో ప్రేమ చూపించేవారే తప్ప.. వారి బ్రతుకులు మార్చే విధంగా మాత్రం ఆలోచ‌న చేయడం లేదని విమర్శలు ఉన్నాయి.. ఏపీలో ఉమ్మడి విశాఖప‌ట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజనులు అర‌కొర‌క సౌక‌ర్యాల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గర్భిణీ మహిళలు ఆసుపత్రులకు వెళ్లడానికి ప్రసవవేదన కు మించిన బాధలను భరించాల్సిన పరిస్థితులు ఉన్నాయి..

అల్లూరి జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో గర్భిణీలకు డోలీ కష్టాలు | Ntv