NTV Telugu Site icon

నిరసన టీకప్పులో తుఫాన్ లాంటిది.. ఉద్యోగుల్లో అసంతృప్తులు సహజం..!

పీఆర్సీ సాధ‌న స‌మితి, ప్ర‌భుత్వం మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయ్యాయి.. కానీ, ఇప్పుడు పీఆర్సీ సాధన సమితి నాయ‌కులు ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ల‌కు త‌ల ఊపిరావ‌డంపై కొంద‌రు ఉద్యోగుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి.. ఉద్య‌మం కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు.. క‌ల‌సివ‌చ్చేవారితో ఉద్య‌మం ఉంటుందంటున్నారు.. మ‌రోవైపు.. ఈ వ్య‌వ‌హారంపై కొంద‌రు ఉద్యోగులుమండిప‌డుతున్నారు.. ఏకంగా పీఆర్సీ సాధ‌న స‌మితి నాయకులకు పుష్పంజలి ఘటిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారంటే.. వారు ఏ రేంజ్‌లో గుర్రుగా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు.. అయితే.. ఉద్యోగుల నిర‌స‌న టీక‌ప్పులో తుఫాన్ లాంటిద‌న్నారు పీఆర్సీ సాధ‌న స‌మితి నేత సూర్యనారాయణ… ఉద్యోగుల ఆందోళన, ఆవేశాలను మేం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.. ఉద్యోగులు ఛ‌లో విజయవాడ ద్వారా తమ అసంతృప్తిని తెలిపినందున ప్రభుత్వం డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించింద‌న్నారు.. అయితే, ఫిట్‌మెంట్ మినహా మిగిలిన అంశాల్లో ఎంతో కొంత పునరుద్ధ‌రించార‌ని సంతృప్తి వ్య‌క్తంచేసిన ఆయ‌న‌.. ఫిట్‌మెంట్ విషయంలో ఆశించిన రీతిలో నిర్ణయం రాలేద‌న్నారు.

Read Also: ఉన్న దాంట్లో ఉద్యోగులకు ఇంకా చేయాల‌ని సీఎం చెప్పారు-స‌జ్జ‌ల‌

మరో 3 అంశాల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంద‌ని తెలిపారు సూర్యనారాయ‌ణ‌.. కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ కాకుండా స్టేట్ పీఆర్సీకి రావడం మేజర్ అచీవ్మెంట్ గా తెలిపిన ఆయ‌న‌.. వచ్చే ఏడాది పీఆర్సీని తీసుకువచ్చేలా పోరాటం చేశామ‌న్నారు.. సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల్లో తీవ్ర మనోవేదన ఉంది.. మార్చి 31లోగా సీపీఎస్ రద్దుపై మంత్రుల కమిటీ రోడ్ మ్యాప్ ను తెలియజేస్తామ‌న్నార‌ని వివ‌రించారు.. సీపీఎస్ రద్దు అంశంపై చాలా తక్కువ సమయంలో పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చార‌న్న ఆయ‌న‌.. ఏళ్ల తరబడి ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం తెలిపార‌ని.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చార‌ని వెల్ల‌డించారు.. ఇక‌, ఫిట్‌మెంట్ తప్ప సీసీఎ, హెచ్ఆర్ఏ, అడిషనల్ క్వాంటం ఫించన్ పై ఆశాజనకంగా ఉంది.. మంత్రుల కమిటీని రెగ్యులర్ కమిటీగా మార్చాలని సీఎస్ ను సీఎం జ‌గ‌న్ ఆదేశించారు.. ఇకపై మేం కూడా మంత్రుల కమిటీతో సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తాం అన్నారు.. ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తగ్గడం వల్లే ఆందోళనలు వచ్చాయ‌ని సీఎంకు తెలిపామ‌ని.. ఉద్యోగుల్లో చిన్న చిన్న అసంతృప్తులు ఉండటం సహజం.. రాబోయే రోజుల్లో అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తాం అన్నారు.. నెలకోసారి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అయ్యేందుకు సీఎం అంగీకరించి ఆదేశించార‌ని తెలిపారు.. ఇక‌, టీచర్ ఎమ్మెల్సీల పదవుల కోసం ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడితే మేమేమీ చెప్ప‌లేమ‌న్న ఆయ‌న‌.. ఉపాద్యాయ సంఘాలు సమావేశం నుంచి బయటకు వచ్చేందుకు ఏ రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయో తెలియ‌ద‌న్నారు.. టీచర్ల వల్ల మాత్రమే చలో విజయవాడ విజయవంతం కాలేదు.. అందరు ఉద్యోగుల వల్లే కార్యక్రమం విజయవంతమైంద‌ని స్ప‌ష్టం చేశారు.. హీరోయిజం కోసం ఉపాద్యాయ సంఘాలు ప్రవర్తిస్తే దానికి మేమేమీచేయలేమ‌ని.. నిరసన అంతా టీకప్పులో తుఫాన్ లాంటిది.. అంతా సమసి పోతుందని భావిస్తున్నాం అని వ్యాఖ్యానించారు పీఆర్సీ సాధ‌న స‌మితి నేత సూర్యనారాయణ.