ఏపీలో పీఆర్సీ రగడ ఇప్పట్లో ఆగేలా లేదు. ప్రభుత్వం సమ్మెకి దిగే ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలని చూస్తుంటే… ఉద్యోగులు మాత్రం తగ్గేది లేదంటున్నారు.కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు, పెన్షన్లు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డీడీవోలు, ట్రెజరీ అధికారుల ద్వారా కొత్త జీతాల ప్రక్రియ చేపట్టింది. అయితే తమ ఉద్యమం ఆగదని, పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
మరింత ముదిరిన పీఆర్సీ ఫైట్..తగ్గేదిలే అంటున్న ఉద్యోగులు
