NTV Telugu Site icon

AP Crime: ఆత్మహత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ప్రియుడి కోసం నగలు తాకట్టు పెట్టి కిరాయి ముఠాతో భర్త హత్య..!

Crime

Crime

AP Crime: ప్రియుడి మోజులో పడ్డ ఓ వివాహిత కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. ఆపై హత్యను.. చాకచక్యంగా ఆత్మహత్యగా చిత్రీకరించి అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, అంతా ఆత్మహత్యగా భావించినా.. ఈ కేసులో ఊహించని ట్విస్ట్‌ వెలుగు చూసింది.. ప్రకాశం జిల్లా పొదిలిలో ఆగస్టు 3వ తేదీన జరిగిన హత్యను పోలీసులు అత్యంత చాకచక్యంగా చేధించారు.. పొదిలికి చెందిన చల్లా నరేంద్రబాబు ఈనెల 3వ తేదీన ఆత్యహత్య చేసుకున్నట్లు పోలీసులకు ముందు సమాచారం అందింది.. అందరూ దీన్ని ముందుగా ఆత్మహత్య గానే భావించారు.. భార్యాభర్తల మధ్య గొడవలతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని భార్య లక్ష్మీప్రియ విలవిలా వలపోస్తూ.. డ్రామా రక్తి కట్టించటంతో అందరూ నమ్మేశారు.. అయితే, భార్య ప్రవర్తనను అనుమానించిన నరేంద్రబాబు తల్లిదండ్రులు పోలీసులుకు తమ అనుమానాలను చెప్పటంతో పాటు ఫిర్యాదు కూడా చేశారు..

Read Also: Paris Olympics: చిన్న వయసులో ఒలింపిక్ పతకం విజేతగా అమన్..టాప్ 5లో ఎవరంటే?

ఇక, పొదిలికి చెందిన చల్లా వెంకట నరేంద్రబాబు ఒంగోలులోని పీఎఫ్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తుంటారు. ఆయనకు ఎనిమిదేళ్ల క్రితం లక్ష్మీ ప్రియ అనే మహిళతో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే లక్ష్మీ ప్రియకు పొదిలి లోని నేతపాలేనికి చెందిన ఓ డాక్యుమెంట్ రైటర్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడి మోజులోపడ్డ లక్ష్మీ ప్రియ ఎలాగైనా తన భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ప్రియుడు కూడా అందుకు అంగీకరించడంతో హత్యకు పక్కా స్కెచ్ రెడీ చేశారు. స్థానిక టుబాకో బోర్డు పక్కన ఉన్న డాబాలోని కింది పోర్షన్ లో మృతుడి తలిదండ్రులు చల్లా వెంకటేశ్వర్లు, ఓబులమ్మ నివాసం ఉంటుండగా.. పైన పోర్షన్ లో నరేంద్ర తన భార్యాబిడ్డలతో కలిసి ఉంటున్నారు. భర్త ఇంట్లో లేని సమయంలో భార్య లక్ష్మీప్రియ ప్రియుడు కొండ శశికుమార్ ఆమె దగ్గరకు తరచూ వచ్చి పోతుండటంతో భార్య ప్రవర్తనలో మార్పును గమనించిన భర్త నరేంద్ర ఆమెను మందలించాడు.. లక్ష్మీప్రియకు ఫోన్ ఇవ్వకుండా దూరంగా ఉంచాడు.. దీంతో ఇది భరించలేని లక్ష్మి ప్రియ ఆమె ప్రియుడు శశికుమార్ లు భర్త నరేంద్రను ఎలాగైనా చంపి వారి అక్రమ సంభందానికి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు..ఈ నేపధ్యంలో ఈ నెల 3వ తేదీ రాత్రి లక్ష్మీప్రియ ఆమె ప్రియుడితో కలసి హతమార్చేందుకు పథకం రచించారు.. భర్తను హతమార్చేందుకు సుపారీ కోసం లక్ష్మి ప్రియ తన ఇంటిలో బంగారు నగలను ప్రియుడు శశికుమార్ కు ఇచ్చి వాటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో కిరాయి మనుషులను మాట్లాడుకుని భర్తను చంపించాలని పథకం వేశారు.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

ఇక, హత్య కోసం నెల్లూరుకు చెందిన నలుగురు వ్యక్తులను రెండు లక్షల కిరాయికి మాట్లాడుకొని వారిని పొదిలికి తీసుకొని వచ్చారు.. అర్ధరాత్రి భర్త నిద్రపోయిన సమయంలో వారందరూ వెళ్లి నిద్రపోతున్న మృతుని గొంతుకి తాడు బిగించి చంపారు.. అనంతరం దాన్ని ఆత్మహత్య గా చూపించాలని వంటగదిలో తాడుకు వేలాడ దీశారు. చనిపోయిన నరేంద్ర నోట్లో మద్యం పోసి.. మద్యం మత్తులో భార్యతో ఘర్షణకు దిగి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య కట్టుకథ అల్లింది. అయితే ఉరి వేసిన తాడు కిందకు వేలాడుతుండటం.. నరేంద్ర శరీరంపై గాయాలు కనిపించడం… కోడలి చేతిపైన గాయాలు ఉండటాన్ని గమనించిన మృతుడి తండ్రి ఏదో జరిగి ఉండవచ్చని అనుమానించారు.. కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తీగలాగడంతో డొంకంతా కదిలింది. దీంతో రంగం లోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. ముందు తమకు ఏమి తెలియదంటూ బుకాయించినప్పటికీ ఆ తరువాత భార్య లక్ష్మీ ప్రియ మొత్తం విషయాన్ని కక్కేసింది.. దీంతో ప్రియుడు శశి కుమార్ సహా హత్యకు కారకులైన నలుగురు కిరాయి హంతకులను పోలీసులు అరెస్టు చేశారు..