AB Venkateswara Rao: రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లా ఒంగోలులో లాసెట్ ఎగ్జామ్‌కి హాజరయ్యారు.. ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రోజు ఉదయం 9 గంటల నుండి ఉదయం 10.30 గంటలకు వరకు జరిగిన లాసెట్ ఎగ్జామ్‌ను ఏబీ వెంకటేశ్వరరావు రాశారు. లా చెయ్యాలన్న ఆలోచనతో ఏవీ వెంకటేశ్వరరావు లాసెట్ కి అప్లయ్ చేశారు.. అయితే, లాసెట్ కి ఆలస్యంగా అప్లయ్ చేయడంతో ఎగ్జామ్ సెంటర్ ఒంగోలులో పడింది.. దీంతో, ఉదయం రోడ్డు మార్గం ద్వారా విజయవాడ నుంచి ఒంగోలు చేరుకున్న ఏబీ వెంకటేశ్వరరావు.. లాసెట్ రాశారు. ఆ తర్వాత విజయవాడకు తిరుగు ప్రయాణం అయ్యారు.. కాగా, గత చంద్రబాబు సర్కార్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావు.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.. అయితే, దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించారు ఏబీ వెంకటేశ్వరరావు.. ఈ నేపథ్యంలోనే ఆయన లాసెట్ రాశారనే చర్చ సాగుతోంది..
Read Also: World Environment Day 2025: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ఎప్పుడు మొదలైందో తెలుసా?
