MLA Tatiparthi Chandrasekhar: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పై తాజాగా పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు.. గతంలో ట్విట్టర్ (ఎక్స్) లో మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే చంద్ర శేఖర్ పెట్టిన పొస్టింగులపై స్థానిక కౌన్సిలర్ ఫిర్యాదుతో ఓ కేసు నమోదు చేసిన విషయం విదితమే కాగా.. ఇవాళ దానికి సంబంధించి ఓ నోటసు ఇచ్చారు.. దీంతో పాటు ఎలక్షన్ సమయంలో పెండింగ్ లో ఉన్న మరో మూడు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. 41 సీఆర్పీసీ కింద ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు నోటీసులు ఇచ్చారు.. యర్రగొండపాలెంలోని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు అందచేశారు..
Read Also: IT Rides: హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు
అయితే, పోలీసులు ఉద్దేశ్య పూర్వకంగా తమ నేతపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ న్యాయపోరాటం చేసేందుకు సిద్దమయ్యారు.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా పోస్టులు.. అరెస్ట్‌లు.. కేసుల వ్యవహారం కాకరేపుతోంది.. వ్యక్తులను.. వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ కొందరు పోస్టుంగులు పెడుతుండగా.. వాటిని సీరియస్‌గా తీసుకున్న సర్కార్.. కేసులు.. అరెస్ట్‌ల వరకు వెళ్తోంది.. కానీ, విపక్షాలు మాత్రం.. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తున్న విషయం విదితమే..