Prakasam: ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంభంలోని తెలుగు వీధిలో కదం శ్యామ్(35) దారుణ హత్యకు గురయ్యాడు. శ్యామ్ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు నిందితులు.. శరీర భాగాలను మూడు గోనె సంచుల్లో పెట్టి.. మేదర్ బజార్ సమీప పంట కాలువ సమీప ప్రాంతంలో పడేసిన వైనం..
Read Also: Rashmika: కథ బాగుంటే.. ఆ పాత్ర చేయడానికి కూడా రెడీ..
అయితే, కన్న తల్లి సాలమ్మ హత్య చేసిందని శ్యామ్ అన్న సుబ్రహ్మణ్యం ఆరోపణలు చేశాడు. ఆటో డ్రైవర్ మోహన్తో కలిసి సాలమ్మ ఘాతుకానికి పాల్పడిందంటున్నాడు సుబ్రహ్మణ్యం.. ఆస్తి తగాదాలతోనే శ్యామ్ను హత్య చేశారని పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. శరీర భాగాలను గుర్తించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శ్యామ్ తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్ను అదుపులోకి తీసుకున్నారు.