NTV Telugu Site icon

AP Crime: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం..! నిండా ముంచిన మనీ సర్కులేషన్‌ స్కీం యాప్‌..

Cyber Crime

Cyber Crime

AP Crime: సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో కొందరు ప్రజలు మనీ సర్కులేషన్ స్కీం యాప్‌ల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందచ్చన్న ఆశతో ఏది నిజమో ఏది అబద్దమో గ్రహించలేక పోతున్నారు. అయితే, కోట్ల రూపాయలలో ప్రజల నుంచి డబ్బులు కట్టించుకొని బోర్డులు తిప్పేస్తున్నాయి మనీ సర్కులేషన్ స్కీం యాప్ లు.. ఎవరికి చెప్పుకోవాలో.. ఏమి చేయాలో తెలియక ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్న ఘటన ప్రకాశం జిల్లాలో తాజాగా వెలుగు చూసింది.

Read Also: Italy: భారతీయ కార్మికుడి మృతి తీరుపై ప్రధాని మెలోని ఆవేదన.. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని ప్రకటన

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు, మార్కాపురం మండలాల మరియు పరిసర ప్రాంతాలలో మై క్వీన్ అనే సంస్థ ప్రజలకు శతగోపం పెట్టింది. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందవచ్చంటూ అమాయక ప్రజలకు మై క్విన్ అనే మనీ సర్కులేషన్ స్కీం సంస్థ వలవేసింది. అత్యధికంగా ప్రైవేటు ఉపాధ్యాయులు, చిరు వ్యాపారులే మైక్ క్విన్ మనీ సర్కులేషన్ యాప్ సంస్థకు టార్గెట్ గా మారారు. వంద రూపాయలు పెడితే 24 గంటల్లో 700 రూపాయలు ఇస్తామని మై క్వీన్ ప్రజలకు ఆశ చూపించి ముంచేసింది.. 24 గంటల్లో పెట్టిన పెట్టుబడికి ఏడు రెట్లు లాభాలు పొందవచ్చన్న ఆశతో ప్రజలు ఎగబడి డబ్బులను మైక్వీన్ లో పెట్టుబడి పెట్టారు. అయితే మై క్వీన్ మనీ సర్కులేషన్ స్కీం యజమాని ఎవరో, ఎక్కడుంటాడో కూడా ఎవరికీ తెలియదు.

Read Also: Asaduddin Owaisi: అసదుద్దీన్‌ ఒవైసీపై అనర్హత వేటు వేయాలి.. రాష్ట్రపతికి న్యాయవాది లేఖ

ఈ సంస్థ చెన్నై కేంద్రంగా నగదు లావాదేవీలు కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే జరిపిందని ప్రాథమిక ఆధారాలు ద్వారా తెలుస్తుంది. మొదట ఈ మై క్వీన్ యాప్ లింకు ద్వారా సంస్థలోకి అడుగు పెట్టిన వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్లోడ్ చేస్తారు. తర్వాత ఒక్క రూపాయి కడితే 24 గంటల తర్వాత ఒక రూపాయికి 7 రూపాయలు సంస్థ చెల్లిస్తుందని చెప్పడంతో మై క్వీన్ లో అడుగుపెట్టిన వాళ్లు మరొకరికి సిఫార్సు చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరిగా మై క్వీన్ మనీ సర్కులేషన్ స్కీమ్ లో వేళల్లో భాగస్వాములుగా మారిపోయారు.. చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలు అప్పులు చేసి మరి కోట్లల్లో మైక్విన్ మనీ సర్కులేషన్ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టారు. గత కొద్దిరోజులుగా ఈ మై క్వీన్ మనీ సర్కులేషన్ స్కీం సంస్థ నగదు లాభాదేవీలను నిలిపివేసింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన ప్రజలు.. ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందని నిశ్శబ్దంగానే ఉండిపోయారు. ఏ ఒక్క బాధితుడు కూడా ఒక్క ఫిర్యాదు అంటే ఒక్క ఫిర్యాదు కూడా ఇవ్వలేదని తెలుస్తుంది. అత్యాశకు పోయి ఇటువంటి సంస్థలలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు…