Minister Nimmala Ramanaidu: జగన్ పర్యటన రాజకీయ కుట్ర కోణంగా ఉంది అనే అనుమానం వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ తీరు దారుణంగా ఉంది. హింసని ప్రేరేపించే విధంగా ఉంది జగన్ తీరు ఉంది. సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలు తీసేవిధంగా ఉందని విమర్శించారు.. పొదిలి పర్యటనలో మహిళలు, పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. రెంటపాళ్లలో 100 మందితో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. జగన్ పర్యటనకి కావాల్సిన భధ్రత ఇచ్చాం. కానీ, జగన్ పర్యటన రాజకీయ కుట్ర కోణంగా ఉందన్నారు.. బెట్టింగ్ కి పాల్పడే వ్యక్తి కి విగ్రహం కట్టడం ప్రపంచంలో ఇదే ప్రథమం అని ఎద్దేవా చేసిన ఆయన.. జగన్ మాటలు నమ్మే బెట్టింగ్ కాశారు. చనిపోయి సంవత్సరం దాటిన తరువాత పరామర్శకి వెళ్ళారు. రెంటపాళ్ళలో జగన్ పరామర్శకి కాదు… దండ యాత్ర కి వెళ్ళారు. రప్పా.. రప్పా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారని మండిపడ్డారు.
Read Also: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ప్రశంసలు
ఇక, జగన్ కారు కింద సింగయ్య పడినా పట్టించుకోలేదు.. ఒక ముఖ్య మంత్రిగా పని చేసిన వ్యక్తి ధోరణి ఇదేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఫైర్ అయ్యారు రామానాయుడు.. కొన ఊపిరితో ఉన్న సింగయ్యని హాస్పటల్ కి తీసుకువెళ్ళకుండా జగన్ దారుణం గా వ్యవహరించారు. మానవత్వం లో పించిన వ్యక్తి జగన్. చనిపోయిన సింగయ్య దళిత బిడ్డ.. వైసీపీ ప్రభుత్వంలో దళిత డాక్టర్ సుధాకర్ ని కొట్టి చంపారని ఆరోపించారు.. దళితుడిని కొట్టి చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీతో జగన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అసలు, జగన్ నుండి ప్రజలకే భధ్రత లేదన్నారు.. జగన్ ఎక్కడ పర్యటన చేసినా జనాన్ని పిట్టలుగా చంపుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు..
