NTV Telugu Site icon

Minister Lokesh: నేడు ప్రకాశం జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ కి శంకుస్థాపన

Lokesh

Lokesh

Minister Lokesh: ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో 375 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీతో కలిసి లోకేశ్ పాల్గొననున్నారు. ఇక, పెద్దాపురంలో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. ఈ ప్లాంట్ 20 ఎకరాల విస్తీర్ణంలో 114.20 కోట్ల రూపాయలతో నిర్మించారు. దివాకరపల్లి నుంచి వర్చువల్ గా మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు. ఉమ్మడి జిల్లాలో వరి, మొక్కజొన్న, చెరకు, పామాయిల్, కూరగాయలు, పూల తోటలు, ఆక్వా నుంచి వచ్చే వ్యర్ధ పదార్థాలు, పశువుల పేడ కంప్రెస్డ్ బయో యూనిట్లకి వనరులుగా రానున్నాయి. అయితే, ఈ బయో ఎనర్జీ ప్లాంట్ 67. 53 టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయనుంది. 70 మందికి ప్రత్యక్షంగా, 200 మందికి పరోక్షంగా ఉపాధి దొరకనుంది.

Read Also: Sai Abhyankar : స్టార్ సింగర్ కొడుకు.. సంగీత దర్శకుడిగా సెన్సేషన్..

ఇక, మంత్రి నారా లోకేష్ పర్యటన షెడ్యూల్ ఇది..
* ఉదయం 7:15 నిమిషాలకు ఉండవల్లి నుంచి బయలుదేరుతారు.
* ఉదయం. 9:15 గంటలకు దివాకరపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు..
* ఉదయం. 9: 25 నిమిషాలకు బయోగ్యాస్ ప్లాంటు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు..
* అనంతరం ఉ. 11:45 వరకు సభలో పాల్గొంటారు..
* ఉదయం. 11:55 నిమిషాలకు అక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు.. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొననున్నారు.