NTV Telugu Site icon

CM Chandrababu: నేడు మార్కాపురానికి సీఎం చంద్రబాబు.. మహిళలతో ముఖాముఖి

Chandrababu

Chandrababu

CM Chandrababu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు (మార్చ్ 8న) మార్కాపురం వెళ్లనున్నారు. ఇక, 10.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా మార్కాపురం చేరుకుని తొలుత జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కాసేపు మాట్లాడనున్నారు. అనంతరం 11.15 గంటల వరకు అధికారులతో భేటీ కానున్నారు. తర్వాత సభాప్రాంగణం దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్స్‌ సందర్శన, లబ్ధిదారులకు పథకాలను పంపిణీ చేయనున్నారు. విశ్రాంతి అనంతరం సుమారు గంటన్నర పాటు మహిళలతో ప్రత్యేకంగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Read Also: Hyderabad: అంబర్‌పేట్‌లో 19 నెలల చిన్నారిపై కుక్కల దాడి.. తీవ్ర గాయాలు

ఇక, పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ తర్వాత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు సీఎం. తిరిగి 4.42 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. అయితే, ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిల నేతృత్వంలో రెండు రోజులుగా అక్కడి తర్లుపాడు రోడ్డులోని సాయిబాలాజీ హైస్కూలు ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత కల్పిస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ తెలిపారు. హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని, సీఎం కాన్వాయ్‌ రూటును పరిశీలించి.. ట్రయల్‌రన్‌ సైతం నిర్వహించారు.