CM Chandrababu: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఛీ ఛీ అనేవాళ్లు.. ఇప్పుడు భలే భలే అంటున్నారు అని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీ పల్లి మండలం లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు.. ఇదే సమయంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలలోని 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కనిగిరి కనకపట్నం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. కనిగిరి కనకపట్నం కావడానికి ఎంతో కాలం పట్టదు అన్నారు.. తుఫానులో సమర్థవంతంగా పనిచేశాం. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పని చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించాం అని పేర్కొన్నారు.. చదువుకుంటున్న విద్యార్థులకు చదువులు పూర్తయ్యలోపు స్థానికంగా ఉపాధి కల్పించే బాధ్యత నాది అని తెలిపారు.. అందరూ ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు.. కానీ, ఇంటికొక వ్యాపారవేత్తని చేస్తామని హామీ ఇచ్చాను. నేను చేసిన పనులే సాక్షాలు అన్నారు.. 25 ఏళ్ల క్రితం అభివృద్ధి ప్రారంభిస్తే హైదరాబాద్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు..
Read Also: CM Revanth Reddy: అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తా..
గత పాలకులు చేసిన పనులు బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరూ చేయరు అని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు.. ప్రజా వేదిక కూల్చడంతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అన్ని తెలిసిన డాక్టర్ ని అయిన నాకే నాడి అంతుబట్టడం లేదు.. ఒకప్పుడు ఏపీ అంటే ఛీ ఛీ అనేవాళ్లు.. ఇప్పుడు ఏపీ అంటే భలేభలే అంటున్నారు. గూగుల్ లాంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయి. లక్షా నలభై వేల కోట్లు గూగుల్ ద్వారా పెట్టుబడులు వస్తున్నాయి. ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్, నేను కలిసి కూటమి పెట్టాం. కేంద్రం తీసుకొచ్చే పాలసీలను రాష్ట్రానికి తీసుకువస్తున్నా.. పవన్ కల్యాణ్ కూడా బాగా మద్దతు ఇస్తున్నారు. బాగా చదువుకున్న లోకేష్ కూడా పట్టువదలని విక్రమార్కుడిగా పని చేస్తున్నాడని పేర్కొన్నారు.. చదువుకున్న పిల్లలు గతంలో అమెరికాకి వెళ్లేవాళ్లు.. ఇప్పుడు ఇక్కడే వ్యాపారాలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. భవిష్యత్తు టెక్నాలజీ ది.. 35 ఏళ్ల క్రితం టెక్నాలజీ గురించి చెప్తే అవహేళన చేశారు. నన్ను 420 అన్న వాళ్ళే… 420 గా మారారు అంటూ ఫైర్ అయ్యారు.
క్వాంటం కంప్యూటర్స్ అమరావతికి తీసుకొచ్చాం. క్వాంటం కంప్యూటర్స్ జనవరిలో ప్రారంభమవుతుంది. జపాన్, అమెరికా సరసన మనం చేరబోతున్నాం అని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సోలార్, విండ్ ఎనర్జీ పెడుతున్నాం. తక్కువ ఖర్చుతో విద్యుత్ తయారు చేయటానికి పని చేస్తున్నాం. వెనుకబడిన అనంతపురంకి కియా తీసుకొచ్చాం. కియా రాకతో అనంతపురంలో పరిస్థితులు మారిపోయాయి. నిత్యవసర వస్తువుగా సెల్ఫోన్ మారింది. లేటెస్ట్ టెక్నాలజీని ఏపీకి తీసుకొస్తాం. రోబోటిక్స్ కూడా ఏపీకి తీసుకొస్తాం అన్నారు.. విశాఖలో 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు పెడుతున్నాం. 50 దేశాల నుండి ప్రతినిధులు వస్తున్నారు. 9 నుండి10 లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు. గతంలో ఒక ఫ్యామిలీ ఒక ఐటి అని చెప్పాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక వ్యాపారవేత్త అని చెబుతున్నాను అన్నారు.. వెలిగొండ నీళ్లు కనిగిరిని సస్యశ్యామలం చేస్తాయి. 2026 కి వెలిగొండ నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ.. ఇప్పుడు రాయలసీమ రతనాల సీమ.. గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకొచ్చి తాగిస్తా. కులం, మతం అనేది పోవాలి. అభివృద్ధి చేసే వాళ్ళకి ప్రజలు మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..